మాస్కో : మనిషికి విశ్వాసంగా ఉండే జంతువుల్లో శునకానికే అగ్రస్థానం ఉంటుంది. అలాంటి జీవిని అతి కర్కోటకంగా హింసించి చంపాడో రష్యన్. ఆ మూగజీవి మరణం చూసి చలించిన ప్రతీ ఒక్కరూ ఇప్పుడు ఆ మానవమృగాన్ని వదలొద్దంటూ సోషల్ మీడియాలో ఉద్యమం నడుపుతున్నారు.
చల్లని నీటిని దానిపై పోసి.. ఆపై ఓ బోనులో -32 డిగ్రీల సెల్సియస్ మంచులో దానిని పడుకోబెట్టాడు. అది గమనించిన స్థానికులు అప్రమత్తం అయి దానిని రక్షించేలోపే అది గిలగిల కొట్టుకుంటూ అది ప్రాణాలు వదిలింది. గతంలో కూడా ఆ శునకాన్ని యాజమాని తరచూ వేధించిన సందర్భాలు ఉన్నాయని చుట్టుపక్కల వారు చెబుతున్నారు.
ప్రాణ భయంతో ఆ ఆడ శునకం తన కాలిని ఆడించటం.. మిగతా భాగమంతా చలికి చచ్చుబడిపోవటం ఆ వీడియోలో చూడొచ్చు. ఏడాది వయసున్న ఆ శునకాన్ని అప్పటికే బయటకు తీసినప్పటికీ అది ప్రాణాలు వదిలిందని.. దాని చూపులు ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయని జంతు సంరక్షణ ఉద్యమకారిణి యాకుట్సక్ తెలిపారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఓ పిటిషన్ పై సంతకాల సేకరణ చేపట్టగా.. ఇప్పటికీ సుమారు 15వేల మందికి పైగానే సంతకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment