విశ్వసనీయుడిపై పుతిన్ వేటు | Russia's Putin sacks chief of staff Sergei Ivanov | Sakshi
Sakshi News home page

విశ్వసనీయుడిపై పుతిన్ వేటు

Published Fri, Aug 12 2016 4:48 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

విశ్వసనీయుడిపై పుతిన్ వేటు

విశ్వసనీయుడిపై పుతిన్ వేటు

రష్యా: ఎన్నో ఏళ్లుగా తన వద్ద విశ్వాసంగా ఉంటున్న ఉన్నతాధికారిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ విధుల నుంచి తొలగించారు. ఆయనను తొలగించడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. అక్కడి అధికార ప్రతినిధులు చెప్పిన వివరాల ప్రకారం ఇవనోవ్ (63) అనే వ్యక్తి పుతిన్ పరిపాలన విభాగంలో అత్యంతముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆయన అంతర్గత వ్యవహారాలకోసం ఉన్న ప్రత్యేక సర్కిల్కు ఇవనోవ్ బాస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రస్తుతం పర్యావరణం, రవాణాశాఖవంటివాటికి ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. కానీ, అనూహ్యంగా పుతిన్ ఆయనను విధుల నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో ఆంటాన్ వైనోకు బాధ్యతలు అప్పగించనున్నట్లు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement