
మిలన్: ఇటలీని గడగడలాడించిన మాఫియా డాన్, ‘బాస్ ఆఫ్ బాసెస్’గా పేరుగాంచిన సాల్వటోర్ టొటొ రీన్(87) ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ శుక్రవారం చనిపోయాడు. మాఫియాపై ఉక్కుపాదం మోపిన జడ్జీలు పోలీసుల్ని హతమార్చేందుకు కుట్రపన్నిన కేసుల్లో 26 యావజ్జీవ శిక్షల్ని టొటొ ఎదుర్కొంటున్నాడు. టొటొపై 150 మందిని హతమార్చినట్లు ఆరోపణలున్నాయి.
ఇటలీ ప్రస్తుత అధ్యక్షుడు సెర్జియో మట్టరెల్లా అన్న, పాలెర్మో అధ్యక్షుడు పీర్‌శాంటి మట్టరెల్లాను టొటొ బృందం 1980లో కాల్చిచంపింది. గురువారం పుట్టిన రోజు సందర్భంగా కుటుంబీకులను కల్సుకున్నాక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ‘కోసా నోస్ట్రా’గా పిలుచుకునే ఇటాలియన్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఇద్దరు జడ్జీలు, పోలీసుల్ని 1992లో కారు బాంబులతో హతమార్చాడు.