
బోస్టన్: వడ ఆకారంలో ఉండే రాయి నుంచి వచ్చిన మేఘాలతో చంద్రుడు ఏర్పడ్డట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సినెస్టియా అని పిలిచే ఈ రాయికి ఆవిరయ్యే గుణం ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు భావిస్తున్నట్లు పేలుడు సంభవించడం వల్ల ఏర్పడలేదని ఓ అధ్యయనంలో తేలింది. ‘అరుణగ్రహం పరిమాణంలో ఉండే ఓ పదార్థం, పురాతన భూమిని ఢీకొనడం వల్ల చందమామ ఏర్పడిందని అందరూ నమ్ముతున్న సిద్ధాంతం’ అని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన సైమన్ లాక్ పేర్కొన్నారు.
అయితే ఇదంతా తప్పు అని లాక్ చెబుతున్నారు. ఢీకొనడం వల్ల చంద్రుడు ఏర్పడేందుకు చాలా తక్కువ అవకాశాలున్నాయని వివరించారు. వారి పరీక్షల ప్రకారం భూమి, చంద్రుడికి సంబంధించి ‘ఫింగర్‌ప్రింట్లు’ దాదాపు సారూప్యంగా ఉన్నాయని, దీంతో ఇవి రెండు ఒకే వస్తువు నుంచి ఏర్పడినట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment