వీసా కోసం నకిలీ పెళ్లిళ్లు | Several Indians Indicted In Marriage Visa Fraud In US | Sakshi
Sakshi News home page

వీసా కోసం నకిలీ పెళ్లిళ్లు

Published Sat, May 21 2016 1:53 PM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

వీసా కోసం నకిలీ పెళ్లిళ్లు

వీసా కోసం నకిలీ పెళ్లిళ్లు

వాషింగ్టన్: వీసా కోసం భారతీయులు, భారత సంతతికి చెందిన అమెరికన్లను నకిలీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అధికారులు ఆరోపించారు. వీసా లభించని వాళ్లు అమెరికన్లను మోసగించి వివాహమాడుతున్నారని, ఆ తర్వాత యూ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నారని వెల్లడించారు. సాధారణంగా యూవీసాను మానసిక, శారీరక సమస్యలు ఉన్నవారికి ఇస్తారు.

యూ-వీసాతో ఇక్కడ ఎక్కువ కాలం ఉండేందుకు అమెరికా అనుమతినిస్తుంది. అమెరికా పౌరసత్వం పొందేందుకు ఇటీవల సిమ్సన్ గుడ్‌మన్ అనే న్యాయవాది నకిలీ పత్రాలను సమర్పించారని అధికారుల బృందం ఆరోపించింది. అమెరికా కేంద్ర సమాచార శాఖకు సమర్పించిన ఈ నకిలీ పత్రాలను ఐవరీ హారిస్ కు చెందిన జాక్సన్‌ అనే వ్యక్తి తయారుచేసినట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement