వీసా కోసం నకిలీ పెళ్లిళ్లు
వాషింగ్టన్: వీసా కోసం భారతీయులు, భారత సంతతికి చెందిన అమెరికన్లను నకిలీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అధికారులు ఆరోపించారు. వీసా లభించని వాళ్లు అమెరికన్లను మోసగించి వివాహమాడుతున్నారని, ఆ తర్వాత యూ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నారని వెల్లడించారు. సాధారణంగా యూవీసాను మానసిక, శారీరక సమస్యలు ఉన్నవారికి ఇస్తారు.
యూ-వీసాతో ఇక్కడ ఎక్కువ కాలం ఉండేందుకు అమెరికా అనుమతినిస్తుంది. అమెరికా పౌరసత్వం పొందేందుకు ఇటీవల సిమ్సన్ గుడ్మన్ అనే న్యాయవాది నకిలీ పత్రాలను సమర్పించారని అధికారుల బృందం ఆరోపించింది. అమెరికా కేంద్ర సమాచార శాఖకు సమర్పించిన ఈ నకిలీ పత్రాలను ఐవరీ హారిస్ కు చెందిన జాక్సన్ అనే వ్యక్తి తయారుచేసినట్లు పోలీసులు తెలిపారు.