టొరంటో: మీరు ఎప్పుడైనా శృంగారాన్ని హోటల్ లో అనుభవించారా? ఇంట్లో కంటే హోటల్లోనే ఎక్కువసేపు ఆ అనుభవాన్ని ఆస్వాదించినట్టు, ఆ సుఖం ఎక్కువ ఫలప్రదం అయినట్టు అనిపించిందా? మీ పెదవులపై విరబూసిన చిలిపి చిర్నవ్వు ఔననని సమాధానం ఇస్తే... ఈ విషయంలో మీరొక్కరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇదే అనుకుంటున్నారని తాజా అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది. 11 దేశాల్లో 2,200 మందిపై అధ్యయనం జరిపిన అధ్యయనంలో హోటల్ లో శృంగార అనుభవం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
సర్వేలో పాల్గొన్న చాలామంది ఇంట్లో కంటే హోటల్ లోనే శృంగార ఆస్వాదనను 25 నుంచి 49 నిమిషాలపాటు అధికంగా అనుభవించామని చెప్పారు. సర్వేలో పాల్గొన్న 53.5శాతం కెనడియన్లు హోటల్ గదిలో శృంగార ఉల్లాసభరితంగా, సాహసోపేతంగా సాగిందని అభిప్రాయపడ్డారు. హోటల్ టునైట్ సంస్థ ఈ అంతర్జాతీయ సర్వే నిర్వహించింది. నార్త అమెరికన్స్ కూడా హోటల్ లో ఆ అనుభవంలోనే ఎక్కువ మజా ఉందని చెప్పారు. ఇటాలియన్లు, ఆస్ట్రేలియన్లు, రష్యన్లు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. హోటల్ గదిలో శృంగారాన్ని స్వేచ్ఛగా అనుభవించినట్టు, భాగస్వాములతో ఎక్కువ ప్రేమతో గడిపినట్టు తెలిపారు.
హోటల్ గది కాదు నాణ్యమైన పరుపు కూడా శృంగార ఆస్వాదనలో ప్రముఖ పాత్ర పోషిస్తుందట. సర్వేలో పాల్గొన్న వారు చక్కనైన పరుపు ఉండటంతో భాగస్వామితో ఎక్కువ ప్రేమతో మెలిగినట్టు తెలిపారు. కెనడా పురుషులు విశాలమైన పరుపులు ఎక్కువ సౌఖ్యం ఉంటుందని భావిస్తే.. కెనడా మగువులు మాత్రం పరుపు కాస్త గట్టిగా ఉండటమే మేలని అభిప్రాయపడ్డారు.
ఇంట్లో కంటే హోటల్ లోనే 'ఆ' మజా ఎక్కువట!
Published Thu, Nov 26 2015 4:57 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement
Advertisement