
చాలా మందికి తమ స్మార్ట్‌ఫోన్‌లను బాత్రూంలోకి తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. కొంతమంది అయితే ఫోన్ తీసుకెళ్లి గంటల తరపడి బాత్రూంలో ఉంటారు. దీని వల్ల చాలా సమయం వృధా అవుతుంది. ఈ చెడు అలవాటును పోగొట్టేందుకు ఓ కంపెనీ తమ ఉద్యోగులకు వింత హెచ్చరిక జారీ చేసింది. ఏ ఉద్యోగి అయినా బాత్రూంలో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపొద్దని నిబంధన పెట్టింది. ఒకవేళ పది నిమిషాల కంటే ఎక్కువ సమయం బాత్రూంలో ఉంటే వాసన చూసి నిర్ధారించుకుంటారట. బాత్రూంలో దుర్వాసన రాకుంటే అతని పేరును పైఅధికారికి తెలిపి చర్యలు తీసుకుంటారట.
బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్లి ఎక్కువ సమయాన్ని వృధా చేస్తున్నారనే కారణంగానే ఈ నిబంధనలు పెట్టారట. ఈ హెచ్చరికను కాగితంపై రాసి బాత్రూం తలుపులకు అంటించారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. వాసన చూసే లక్కీ ఉద్యోగి ఎవరని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, అలా అయితే బాత్రూంలో నీళ్లే పోయను అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. కొత్త ఉద్యోగం కావాలనుకేవారికి మంచి అవకాశం అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు. అయితే ఈ నిబంధన ఏ కంపెనీ పెట్టిందో తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment