అమెరికాలో భారత టెకీ మృతి | Software Engineer Died in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారత టెకీ మృతి

Published Fri, Jun 22 2018 10:27 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Software Engineer Died in America - Sakshi

చికాగో: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గురువారం అనుమానస్పద మృతి చెందారు. రామాంతపూర్‌ ప్రగతినగర్‌కు చెందిన కృష్ణప్రసాద్‌ ఈ నెల 21న చికాగోలో నిద్రలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబంతోపాటు అమెరికాలో ఉంటున్న కృష్ణప్రసాద్‌ ఈ మద్యే నగరానికి వచ్చారు. వారం కిందట తిరిగి ఒక్కరే అమెరికా వెళ్లాడు. మరో రెండు రోజుల్లో కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లాల్సి ఉండగా.. ఇంతలోనే ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. అమెరికా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణప్రసాద్ మృతదేహం సోమవారం రామంతాపూర్‌కు చేరుకోనున్నది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement