ట్రంప్‌ టాయిలెట్‌ బ్రష్‌.. సూపర్‌ సేల్‌! | Someone Has Started Selling Donald Trump Toilet Brushes  | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 19 2018 11:30 AM | Last Updated on Mon, Nov 19 2018 12:47 PM

Someone Has Started Selling Donald Trump Toilet Brushes  - Sakshi

ట్రంప్‌ టాయిలెట్‌ బ్రష్‌

డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు కదా! మరీ ఆయన పేరిట టాయిలెట్‌ బ్రష్‌లేంటీ? అని సందేహపడుతున్నారు. అవును ఇప్పుడు మార్కెట్లో ట్రంప్‌ పేరిట వచ్చిన ఈ టాయిలెట్‌ బ్రష్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎంతలా అంటే ఈ బ్రష్‌ల కోసం కస్టమర్లు ఆర్డరిచ్చి ఏకంగా 6 నుంచి 8 వారాలు వేచి చూసేంత.! ఎప్పుడూ ఏదో వివాదంలో చిక్కుకొని ట్రంప్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంటారు.

అతనంటే ఇష్టపడేవారు... గిట్టనివారు కూడా ఉన్నారు. ఇప్పుడు ట్రంప్‌ హేటేర్సే అతని ముఖ చిత్రంతో తయారు చేసిన టాయిలెట్‌ బ్రష్‌లను రూపోందించి సొమ్ము చేసుకుంటున్నారు. ETSY.comలో అమ్మకానికి పెట్టిన ఈ బ్రష్‌లు న్యూజిలాండ్‌ నుంచి దిగుమతి అవుతున్నాయి. అయితే వీటిని తయారు చేస్తున్న వారి వివరాలు మాత్రమే తెలియరాలేదు. చేతితో తయారు చేసిన ఈ బ్రష్‌ హ్యాండిల్‌ చివరి భాగంలో బ్లూసూట్‌ రెడ్‌ టై కట్టుకున్న ట్రంప్‌ ముఖ చిత్రాన్ని ఉంచారు. దీంతో ఈ బ్రష్‌ వైవిధ్యంగా ఉండటంతో కస్టమర్లు ఎగబడుతున్నారు. ‘నా టాయిలెట్‌ బ్రష్‌ మీద ఉన్నట్లు ఏ టాయిలెట్‌ బ్రష్‌పై దేశ అధ్యక్షులు లేరోచ్‌!.’ అని ఓ వినియోగదారుడు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ బ్రష్‌కు రివ్యూ ఇవ్వడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement