కనీసం రెండు గంటలు నిలబడి పనిచేస్తేనే ఆరోగ్యం
లండన్: అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఆఫీసు పనివేళల్లో కనీసం రెండు గంటలు నిలబడి పనిచేయాలని బ్రిటన్‌కు చెందిన పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్, సీఐసీ అనే స్వచ్ఛంద సంస్థలు సూచించాయి. క్రమంగా ఆ సమయం నాలుగు గంటల వరకు పెంచుకోవాలని పేర్కొన్నాయి. సాధారణ వ్యాయామం కంటే దీని వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని తెలిపాయి.
సమయాన్ని కూర్చొని, నిలబడి చేసే పని సమయాలుగా విభజించుకోవాలని, ఆవిధంగా రోజూ కనీసం రెండు గంటలు నిలబడి పనిచేస్తే అనారోగ్య సమస్యల బారి నుంచి బయటపడవచ్చని తెలిపాయి. ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు 65-75 శాతం సమయం కూర్చొనే పనిచేస్తారు. ఇందులోనూ 50 శాతం సమయం సుదీర్ఘంగా కూర్చొనే ఉంటార ని, అలా కాకుండా పనివేళ ల్లో అప్పుడప్పుడు నడవడం ఉత్తమమని పరిశోధకులు చెప్పారు.