ఆమె రూపమే అత్యుత్తమం | stunning shots are revealed at the Sony Photographer Of The Year awards | Sakshi
Sakshi News home page

ఆమె రూపమే అత్యుత్తమం

Published Fri, Apr 22 2016 3:18 PM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

stunning shots are revealed at the Sony Photographer Of The Year awards

ప్రపంచంలోనే అతిపెద్ద ఫొటోగ్రఫీ పోటీగా భావించే 'సోనీ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుల్లో ఇరానియన్ ఫొటోగ్రాఫర్ జర్నలిస్ట్ సత్తాచూపాడు. లండన్ లో బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వరల్డ్ ఫొటోగ్రఫీ ఆర్గనైజేషన్ ప్రతినిధుల బృందం ఈ ఏటి విజేతల వివరాలను వెల్లడించారు. ఇరానియన్ ఫొటోగ్రాఫర్ జర్నలిస్ట్ అస్గర్ ఖమ్ సేహ్ కు ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డు దక్కింది. 'ఫైర్ ఆఫ్ హార్టెడ్' పేరుతో అస్గర్ చిత్రీకరించిన యాసిడ్ బాధిత మహిళ రూపమే అత్యుత్తమ ఫొటోగా ఎంపికైంది.

జపాన్ కు చెందిన కీ నోమియానాకు ఓపెన్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. వివిధ దేశాలకు చెందిన ఫొటోగ్రాఫర్లు పంపిన దాదాపు 2.5 లక్షల ఫొటోల నుంచి అత్యుత్తమమైనవాటిని అవార్డుకు ఎంపిక చేసినట్లు న్యాయనిర్ణేతలు చెప్పారు. లండన్ లోని సోమర్ సెట్ హౌస్ లో మే 8 వరకు ఈ ఫొటోల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఆ ఫొటోల్లో కొన్ని మీకోసం..


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement