• నలుగురు అమెరికన్లు మృతి
• అఫ్గాన్‌లో ఘటన
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు అమెరికన్లు చనిపోయారని అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ వెల్లడించారు. భారీ భద్రత నడుమ ఉండే ‘బగ్రం ఎరుుర్‌ఫీల్డ్’లో జరిగిన ఈ దాడిలో ఒక పోలాండ్, మరో 16 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. ఈ దాడిని తామే చేశామని తాలిబాన్‌లు ప్రకటించారు. చనిపోరుున నలుగురిలో అమెరికాకు చెందిన ఇద్దరు సైనికులు, ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తి స్థావరంలో పనిచేసే అఫ్గాన్ పౌరుడు అయ్యుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ స్థావరానికి వివిధ అంచెల్లో భద్రతా వ్యవస్థ ఉంటుంది. అఫ్గాన్, అమెరికా సైనికులు నిత్యం సెక్యూరిటీ కెమెరాలతోనూ, స్తంభాలపైకి ఎక్కి ఇక్కడ పహారా కాస్తుంటారు.