
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచిత్ర ప్రకటనలతో అందరినీ ఆందోళన పరుస్తున్నారు. వైరస్‌కు ఔషధాన్ని కనుగొంటున్నామంటూ ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. తాజాగా మరో విచిత్రమైన ప్రకటన చేశారు. కరోనా రోగులను ఎక్కువ వేడి ఉన్న చోటు ఉంచాలని, వేడి ఎక్కువగా ఉండే చోట కరోనా మనుగడ సాధించలేదని అన్నారు. రోగులను ఎండకు ఉంచితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి.. వైరస్ సోకకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే శక్తివంతమైన సన్‌లైట్, అల్ట్రావయొలెట్ రేస్‌లతో రోగి శరీరాన్ని వేడి చేయాలని సలహా ఇచ్చారు. క్లీనింగ్ ఏజెంట్లను కరోనా రోగుల శరీరంలోకి ఇంజక్ట్ చేయాలని ఉచిత సలహాలు ఇచ్చారు.
సూర్యరశ్మి కాంతితో వైరస్‌ను నిరోధించవచ్చిన ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం వైట్ హౌస్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అంతా చెప్పిన తరువాత తానేమీ వైద్యుడికి కాదని, ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ప్రసంగం ముగించారు. కాగా అమెరికాలో కరోనా ఎంతకీ తగ్గుముఖం పట్టడం లేదు. గురువారం నాటికి దేశ వ్యాప్తంగా 8,66,148 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య 48,868కి చేరింది. వైరస్ బారిన పడిఇప్పటి వరకు 84వేలమంది కోలుకున్నారు. (మరోసారి కాటేస్తుంది జాగ్రత్త!)
Comments
Please login to add a commentAdd a comment