ఆ పైలట్ హీరో అయ్యాడు!
తైపీ: విమాన ప్రమాదాలు జరిగిన అనంతరం పైలట్లు ప్రశంసలు అందుకోవడం అరుదుగా జరిగే విషయం. అయితే బుధవారం తైవాన్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో పైలట్ హీరో అయ్యాడు. విమాన ప్రమాదం జరుగుతున్న సమయంలో పైలట్ ప్రయాణికుల్ని అప్రమత్తం చేసిన తీరు ప్రశంసలను అందుకొంటోంది. ఆ సమయంలో పైలట్ 'మేడే-మేడే(ఆపదలో ఉన్నాం రక్షించండి) అనే సంకేతాలు ఇవ్వడం సర్వత్రా పొగడ్తలను కురిపిస్తోంది. అలా అప్రమత్తం చేయడంతో భారీ సంఖ్యలో ప్రాణం నష్టం జరగకుండా చూసి ఆ పైలట్ దేశంలో హీరోగా మారిపోయాడు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాద సంకేతాలను అందజేస్తూనే పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.
మొత్తం 58 ప్రయాణికులతో వెళుతున్న ట్రాన్స్ ఏసియా ఏటీఆర్ 72-600 విమానం కూలిన ఘటనలో 31 మంది మృతి చెందగా, 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మరో 12 మంది గల్లంతయ్యారు. ఈ వీరి కోసం వందల సంఖ్యలు బోట్లు గాలింపు చర్యలు చేపట్టాయి. ఉత్తర తైపీలోని సాంగ్‌షాన్ విమానాశ్రయం నుంచి కిన్మెన్ ద్వీపానికి వెళ్లేందుకు ఆ విమానం టేకాఫ్ తీసుకుంది. బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం ఓ పక్కకు ఒరిగి ఫైఓవర్ను ఢీ కొట్టి... ముందుకు దూసుకెళ్లి... ముక్కలుగా విడిపోయి... నదిలో నడిపోయింది.