భారత్‌ నిర్మించిన డ్యాంపై ఉగ్రవాదుల దాడి | TALIBAN ATTACKS SECURITY POST AT SALMA DAM IN AFGHAN HERAT PROVINCE | Sakshi
Sakshi News home page

భారత్‌ నిర్మించిన డ్యాంపై ఉగ్రవాదుల దాడి

Published Sun, Jun 25 2017 4:48 PM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

భారత్‌ నిర్మించిన డ్యాంపై ఉగ్రవాదుల దాడి

భారత్‌ నిర్మించిన డ్యాంపై ఉగ్రవాదుల దాడి

కాబూల్‌: అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఏకంగా ఆ దేశంలోని ప్రతిష్టాత్మక సల్మా డ్యామ్‌ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 10మంది అఫ్ఘాన్‌ సైనికులు మృత్యువాతపడ్డారు. బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు తెలుస్తోంది. భారత్‌ సహకారంతో ఈ డ్యామ్‌ హెరాత్‌ ప్రావిన్స్‌లో నిర్మించారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా 2016లో ఈ డ్యాం ప్రారంభమైంది.

ముందునుంచే భారత్‌, అప్ఘాన్‌ల మధ్య స్నేహం ఉండటం ఏమాత్రం ఇష్టం లేని తాలిబన్‌ ఉగ్రవాదులు ఈ డ్యాం ప్రారంభమైనప్పటి నుంచి పలుమార్లు దాడి చేసేందుకు కుట్రలు చేసింది. దాడులకు దిగుతామంటూ బెదిరింపులు కూడా పంపించింది. ఈ నేపథ్యంలో సల్మా డ్యాం వద్ద పెద్ద మొత్తంలో సెక్యూరిటీని, స్థానిక పోలీసులను కాపాలగా ఉంచారు. అయితే, డ్యాంపై దాడికి దిగాలనుకున్న ఉగ్రవాదులు తొలుత ఆర్మీ, పోలీసు పోస్టింగులపై తాజాగా దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన బలగాలు కాల్పులు జరిపి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆ దేశ భద్రతాధికారుల ప్రతినిధి ఒకరు చెప్పారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement