పురాతన దేవాలయంపై బాంబు దాడులు
పురాతన దేవాలయంపై బాంబు దాడులు
Published Sat, Dec 5 2015 4:05 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM
ఢాకా: బంగ్లాదేశ్లోని దినాజ్పూర్ సమీపంలో పురాతన హిందూ దేవాలయంపై గుర్తుతెలియని దుండగులు బాంబులతో దాడిచేశారు. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు బంగ్లాదేశ్ దినాజ్పూర్ లో రష్ మేళా సందర్భంగా జరుగుతున్న వేడుకను చూడటానికి చాలా మంది పురాతన కంతాజీ ఆలయానికి తరలివచ్చారు.
జాతర జరుగుతుండగా శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని నిందితులు దినాజ్పూర్లోని కంతాజీ ఆలయంపై బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో పది మంది భక్తులు గాయపడ్డారు. కంతాజీ ఆలయం పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం దినాజ్ పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు బాంబులను పథకం ప్రకారం భూమిలో పాతిపెట్టి అదునుచూసి పేల్చివేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడినట్లు భావించి ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టినట్లు వివరించారు.
Advertisement