Dinajpur
-
పట్టాలపై సెల్ఫోన్లో బిజీ.. నలుగురిని చిదిమేసిన రైలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో ఆదివారం అర్థరాత్రి దాటాక ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఇస్లాంపూర్‌లో రైల్వే ట్రాక్‌పై సెల్ఫోన్లో బిజీగా ఉన్న నలుగురు టీనేజర్లు.. రైలు ఢీకొట్టిన ఘటనలో దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై కూర్చుని సెల్ఫోన్లో మునిగిపోయిన ఆ నలుగురు యువకులపై నుంచి రైలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వారంతా 13-14 ఏళ్ల మధ్య వయసు వారని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై ఇస్లాంపూర్ ఎస్పీ సచిన్ మక్కర్ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి రైలు పట్టాలపై కూర్చొని సెల్ఫోన్లో నిమగ్నమైన నలుగురు మైనర్ బాలురు రైలు వస్తున్న విషయాన్ని కూడా గమనించలేదని, దీంతో రైలు వారిపై 50 మైళ్ల వేగంతో దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. మృతదేహాలు గర్తుపట్టలేనంతగా ఛిద్రం కావడంతో పోస్ట్‌మార్టం చేసేందుకు కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని, విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన దహన సంస్కారాలు జరిపించారని వెల్లడించారు. ఈ ఘటనపై తమకెటువంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. సంఘటనా స్థలం వద్ద సెల్ఫోన్ల విడిభాగాలు చెల్లా చెదురుగా పడి ఉండటాన్ని గమనించామని అన్నారు. మృతుల కుటంబ సభ్యులెవరైన ఫిర్యాదు చేస్తే ఘటనపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. చదవండి: భర్తను హత్య చేసిన భార్య .. పోలీసుల రంగప్రవేశంతో.. -
విచారణ కోసం వెళ్లిన పోలీసుని రాళ్లతో కొట్టి..
ఇస్లామాపూర్: బైక్ చోరీ కేసులో దర్యాప్తు కోసం వెళ్లిన ఓ పోలీస్ అధికారిని కొట్టి చంపారు స్థానికులు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన అశ్వనీ కుమార్ కిషన్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్‌హౌస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఓ బైక్ చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తు కోసమని ఆయన బెంగాల్‌లోని ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాకు వెళ్లారు. నిందితుడు అక్కడి పంజిపరా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నాడని తెలిసి ఆ ప్రాంతంలో గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో గోల్ పొఖారా ప్రాంతంలోని ఓ గ్రామానికి వెళ్లగా.. సదరు గ్రామస్థులు దర్యాప్తు కోసం వచ్చిన అశ్వనీకుమార్‌పై రాళ్లు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దాడి అనంతరం పోలీసు వారు అతన్ని రక్షించేందుకు ఇస్లాంపూర్ సదర్ ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యలో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారు ఫిరోజ్ ఆలం, అబుజార్ ఆలం, సాహినూర్ ఖాటూన్‌లుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని పూర్ణియా రేంజ్ ఐజీ తెలిపారు. బిహార్ పోలీసులు స్పందిస్తూ.. కేసు విచారణ నిమిత్తం బెంగాల్ వెళ్లిన అశ్వనీ కుమార్ స్థానిక పోలీసుల సహకారం కోరారు. కానీ బెంగాల్ పోలీసులు అతడి వెంట బృందాన్ని పంపడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ( చదవండి: ఉదయపు దొంగ అరెస్టు ) -
దారి తప్పిన దీదీ హెలికాఫ్టర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారితప్పడం పార్టీ శ్రేణుల్లో, అధికారుల్లో కలవరానికి కారణమయింది. బుధవారం ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా చోప్రా జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కోసం మమతా బెనర్జీ.. మధ్యాహ్నం 1.05 గంటలకు సిలిగురి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే షెడ్యూల్ ప్రకారం 1.27 గంటలకు ఆమె అక్కడికి చేరుకోవాల్సి ఉంది. అయితే సమయం దాటినా కూడా మమత ప్రయాణిస్తున్న చాపర్ అక్కడికి రావకపోవడంతో జిల్లా అధికారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే మమత ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ పైలట్ సభాస్థలిని గుర్తించకపోవడంతో.. వారు బిహార్‌లోకి ప్రవేశించారు. వెంటనే పైలట్‌తో సంప్రదింపులు జరిపిన అధికారులు హెలికాఫ్టర్ సభాస్థలికి చేరుకునేలా డైరక్షన్స్ ఇచ్చారు. ఫైలట్ సభాస్థలిని గుర్తుపట్టేలా స్మోక్డ్ గన్స్ సాయంతో రంగుల పొగలను వదిలారు. దీంతో మమత ప్రయాణిస్తున్న చాపర్ 2 గంటల సమయంలో హెలిప్యాడ్ వద్ద క్షేమంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత చోప్రా సభలో ప్రసంగించిన మమత మాట్లాడుతూ.. సభకు సమయానికి రాలేకపోయినందుకు క్షమాపణలు కోరారు. ఫైలట్ హెలికాఫ్టర్ దిగే స్థలాన్ని గుర్తించకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు. అయితే జెడ్ ప్లస్ భద్రత ఉన్న మమత ప్రయాణిస్తున్న చాపర్ దారితప్పడం కాసేపు అధికార యంత్రాగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సభ జరుగుతున్న ప్రాంతం బంగ్లాదేశ్ సరిహద్దులకు దగ్గరగా ఉండటం కూడా వారిని ఉలిక్కిపడేలా చేసింది. కాగా, ఈ ఘటనపై విచారణ చేపట్టడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు న్యూస్-18 ఓ కథనాన్ని ప్రచురించింది. -
పురాతన దేవాలయంపై బాంబు దాడులు
ఢాకా: బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ సమీపంలో పురాతన హిందూ దేవాలయంపై గుర్తుతెలియని దుండగులు బాంబులతో దాడిచేశారు. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు బంగ్లాదేశ్ దినాజ్‌పూర్ లో రష్ మేళా సందర్భంగా జరుగుతున్న వేడుకను చూడటానికి చాలా మంది పురాతన కంతాజీ ఆలయానికి తరలివచ్చారు. జాతర జరుగుతుండగా శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని నిందితులు దినాజ్‌పూర్‌లోని కంతాజీ ఆలయంపై బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో పది మంది భక్తులు గాయపడ్డారు. కంతాజీ ఆలయం పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం దినాజ్ పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు బాంబులను పథకం ప్రకారం భూమిలో పాతిపెట్టి అదునుచూసి పేల్చివేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడినట్లు భావించి ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టినట్లు వివరించారు.