బియ్యం అమ్మిన థాయ్ మాజీ ప్రధాని
బ్యాంకాక్: గద్దె దిగిపోయిన థాయ్‌లాండ్ ప్రధాని ఇంగ్లుక్ షినవత్ర వందలాది మందికి సంచుల కొద్దీ బియ్యాన్ని అమ్మారు. ధరలు పడిపోవడంతో నష్టపోయిన రైతుల పట్ల సైనిక ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఇలా నిరసన చేపట్టారు.
వరి రైతులతో కలసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈశాన్య ప్రాంతాల్లోని గ్రామాల్లో గతవారం పర్యటించిన ఆమె ట్రక్కుల కొద్ది బియ్యాన్ని రైతుల నుంచి కొన్నారు. బ్యాంకాక్‌లోని ఓ వీధిలో దుకాణం ఏర్పాటుచేసి ప్రజలకు అమ్మారు. ఒక కిలో బియ్యాన్ని రూ.38కి విక్రయించారు. 2014 నాటి తిరుగుబాటు వల్ల ఇంగ్లుక్ ప్రభుత్వం కూలిపోవడం తెలిసిందే.