ఈ వీడియో చూస్తే కడుపుచెక్కలవ్వాల్సిందే..! | This super hilarious video is deffinately will make you laugh | Sakshi
Sakshi News home page

ఈ వీడియో చూస్తే కడుపుచెక్కలవ్వాల్సిందే..!

Published Sun, Jan 1 2017 6:08 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

ఈ వీడియో చూస్తే కడుపుచెక్కలవ్వాల్సిందే..! - Sakshi

ఈ వీడియో చూస్తే కడుపుచెక్కలవ్వాల్సిందే..!

కొత్త ఏడాది సందర్భంగా ఓ ఫన్నీ వీడియో ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన ఏ ఒక్కరికి నవ్వకుండా ఉండటం అస్సలు సాధ్యం కాదు. ఇద్దరు బాల భీములు బరువు తగ్గించే వైబ్రేట్‌ మిషన్‌ మీద నిల్చుని ఆ మెషిన్‌ వారి శరీరాన్ని వైబ్రేట్‌ చేసే సమయంలో వారు పలికిస్తున్న హావభావాలు కడుపుచెక్కలయ్యేలా నవ్విస్తున్నాయి.

ఈ వీడియో ఎక్కడి నుంచి పోస్ట్‌ చేశారనే వివరాలు మాత్రం అందుబాటులో లేవుగానీ, ఆ బాల భీముల్ని చూస్తుంటే మాత్రం కచ్చితంగా వారు కొరియానో లేఖ చైనాకు చెందిన చిన్నారులో అయ్యుంటారనే విషయం అర్థమవుతుంటుంది. ఈ వీడియోలో ఏముందంటే ఇద్దరు చిన్నారులు.. ఒకరు రెడ్‌ డ్రెస్‌లో మరొకరు వైట్‌ డ్రెస్‌లో ఉన్నారు. వయసు తక్కువే ఉన్నప్పటికీ అంతకుమించిన బరువుతో ఉన్నారు. వారిని వెయిట్‌ లాస్‌ సెంటర్‌కు తీసుకొచ్చిన తల్లిదండ్రులు వైబ్రేట్‌ మిషన్‌పై వారిని నిలబెట్టి అనంతరం వారిని వీడియోతీశారు. ఆ సమయంలో చోటు చేసుకున్న ఫన్నీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను మీరూ చూడండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement