
ఎయిర్‌పోర్ట్‌లో బ్యూటీ క్వీన్ అరెస్టు
పాపులర్ నటిగా దూసుకుపోతున్న మయన్మార్ బ్యూటీ (ట్రాన్స్‌జెండర్) మ్యోకోకోసాన్ అరెస్టయింది. థాయిలాండ్ ట్రిప్ నుంచి తిరిగొస్తున్న ఆమెను విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు.
మయన్మార్: పాపులర్ నటిగా దూసుకుపోతున్న మయన్మార్ బ్యూటీ (ట్రాన్స్‌జెండర్) మ్యోకోకోసాన్ అరెస్టయింది. థాయిలాండ్ ట్రిప్ నుంచి తిరిగొస్తున్న ఆమెను విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టడంతోపాటు కొంత అసభ్యకరమైన పదజాలం ఉపయోగించందనే ఆరోపణల కిందట అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఆమెను యాంగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నపోలీసులు ప్రస్తుతం మహిళల జైలులో ఒంటరిగా ఉంచి విచారణ చేస్తున్నారు.
ఈ నెలాఖరుకి అది పూర్తయ్యే అవకాశం ఉంది. టెలీకమ్యునికేషన్ చట్టం ప్రకారం సెక్షన్ 66(డీ)కింద ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. వుట్ మోన్ యీ అనే వ్యక్తిని అవమానించేలా ఆమె ఫేస్‌బుక్ ఇతర సోషల్ మీడియాలో అసభ్యకరంగా సందేశాలు పెట్టిందట. లింగమార్పిడి చేసుకున్న తర్వాత థాయిలాండ్ లో జరిగిన ట్రాన్స్‌జెండర్ మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని తొలిస్థానాన్ని దక్కించుకుని ఈమె 2015లో ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి తొలుత సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టారు.