న్యూయార్క్ : ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ పెద్దన్న పాత్ర పోషించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ‘అమెరికా ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ’ అవలంభిస్తున్న నేపథ్యంలో.. భారత్ పెద్దన్న పాత్రలోకి రావాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. సోమవారం డొనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీ ప్లాన్‌ను విడుదల చేశారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం భద్రతను భారత్ పర్యవేక్షించాలని.. ఈ క్రమంలో ఇరుదేశాల ఉమ్మడి విస్తృత ప్రయోజనాల కోసం భారత్ పెద్దన్న పాత్ర వహించాలని ట్రంప్ కోరారు. జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌తో కలిసి ఏర్పాటు చేస్తున్న చతుర్భుజ కూటమికి కట్టుబడి ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రపంచశక్తిగా భారత్ ఎదగడాన్ని ఆహ్వానిస్తున్నామని, అదే సమయంలో భారత్‌తో వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్‌పై ఒత్తిడిని పెంచుతున్నట్లు తెలిపారు. రష్యా, చైనాలు బలమైన దేశాలే అయినప్పటికీ.. అమెరికా విలువలు, అవసరాల దృష్ట్యా భారత్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఇదిలాఉండగా.. చైనాపై ట్రంప్ ఘాటు విమర్శలు చేశారు. చాలా ఏళ్లుగా అమెరికా సాంకేతి పరిజ్ఞానాన్ని చైనా సంస్థలు తస్కరిస్తున్నాయని చెప్పారు. ఈ విషయంపై పలు అమెరికా సంస్థలు ఇప్పటికే పలుసార్లు ఫిర్యాదులు చేశాయని చెప్పారు. వీటిని ఇక ఎంతోకాలం భరించలేమని ట్రంప్ అన్నారు.
అమెరికా వ్యాఖ్యలపై రష్యా, చైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత్‌కంటే తామే బలంగా ఉన్నామని.. ఆయా దేశాలు ప్రకటించాయి. డొనాల్డ్ ట్రంప్ ఒక పెట్టుబడిదారుడిగా వ్యవహరిస్తున్నాయని ఆయా దేశాలు మండిపడ్డాయి. ప్రస్తుతం బహుళ ధృవాల ప్రపంచం ఉందని.. ఇంకా అమెరికా ఏక ధృవ ప్రపంచాధినేత అనే భ్రమలో ఉందని చైనా వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment