
న్యూయార్క్: వరుస వివాదాలతో ఇబ్బందులు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో కలకలం చెలరేగింది. ఆయన పెద్దకొడుకు ట్రంప్ జూనియర్ భార్య వనెస్సా హేడన్ ట్రంప్ (40).. తనకు తక్షణమే విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ మన్‌హట్టన్‌లోని కోర్టును ఆశ్రయించారు. జూనియర్ ట్రంప్ కుటుంబాన్ని అస్సలు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ ఆమె పిటిషన్‌వేశారు. 2005 నవంబర్‌లో జూనియర్ ట్రంప్‌ను వనెస్సా పెళ్లాడారు. వీరికి ఐదుగురు సంతానం. చర్చించుకుని విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు భార్యాభర్తలిద్దరూ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment