
లాస్‌వేగాస్: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ వల్లే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారని ఫేస్‌బుక్ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా రష్యా, తప్పుడు సమాచారం, కేంబ్రిడ్జి అనలిటికా వల్ల మాత్రం కాదని, కేవలం ట్రంప్ వర్గాలు ఫేస్‌బుక్‌లోనడిపిన డిజిటల్ ప్రచారంతోనే నెగ్గారని సీనియర్ ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రూ బోస్‌వర్త్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ వర్గాలు నడిపిన డిజిటల్ ప్రచారం లాంటి దానిని తాను ఇప్పటివరకు చూడలేదన్నారు. ద్వేషపూరిత నాయకులు వద్దనుకుంటే.. వారిని కచ్చితంగా ఎన్నుకోకూడదని సూచిం చారు. అప్పటి ప్రచార పాలసీలే ప్రస్తుతం కూడా ఉన్నాయని, తాము వాటిని మార్చాలని అనుకోవడం లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment