ట్విటర్‌లో 'కనెక్ట్' ట్యాబ్ | Twitter launches Connect tab | Sakshi
Sakshi News home page

ట్విటర్‌లో 'కనెక్ట్' ట్యాబ్

Published Thu, May 5 2016 10:58 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

ట్విటర్‌లో 'కనెక్ట్' ట్యాబ్

ట్విటర్‌లో 'కనెక్ట్' ట్యాబ్

న్యూయార్క్: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్  తన వినియోగదారుల కోసం బుధవారం సరికొత్త ట్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది. 'కనెక్ట్' పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్యాబ్ ద్వారా మీ స్నేహితులను మరింత సులభంగా వెతుక్కుంటారని ఆ సంస్థ ప్రోడక్ట్ మేనేజర్ రికార్డో క్యాస్ట్రో తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆటోమేటిక్‌గా ఖాతాదారుల అడ్రస్ బుక్‌కు సింక్ అయ్యేలా 'కనెక్ట్' ట్యాబ్‌ను పొందుపర్చామన్నారు.

అడ్రస్ బుక్‌లో ఉన్నవారిలో ఎవరైనా ట్విటర్‌లో చేరితే వెంటనే ఈ కనెక్ట్ ట్యాబ్ ద్వారా వారికి సాదర స్వాగతం పలకవచ్చన్నారు. ప్రస్తుతం ఐఓఎస్‌తోపాటు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని, త్వరలో మిగతావారికి కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement