
ఈ ఏడాది ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్ ఇవే..
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్లో ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఆసక్తిగా గమనించిన, స్పందించిన విషయాలు ఏమై ఉంటాయి. అనూహ్యంగా అమెరికా అధ్యక్ష పీఠం కైవసం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్‌నా.. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుపడిన బ్రెగ్జిటా. ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా.. 2016 మోస్ట్ పాపులర్ అంశాల జాబితాను ట్విట్టర్ వెల్లడించింది.
ఈ జాబితాలో రియో ఒలింపిక్స్‌కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ #Rio2016 మొదటి స్థానంలో నిలువగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి #election2016 రెండో స్థానంలో నిలిచింది. ఆన్‌లైన్ గేమింగ్‌లో ప్రకంపనలు సృష్టించిన #PokemonGo ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవడం విశేషం. తరువాతి స్థానాల్లో #Euro2016, #oscars నిలిచాయి.
బ్రెగ్జిట్ హ్యాష్ ట్యాగ్ #Brexit ఈ జాబితాలో ఆరోస్థానంలో ఉంది. కాగా.. డొనాల్డ్ ట్రంప్ #Trump హ్యాష్ ట్యాగ్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. టాప్ 10 జాబితాలో నిలిచిన.. ఒకే ఒక వ్యక్తికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ట్రంప్ది కావడం విశేషం.