టీవీ యాంకర్ ఓవర్ యాక్షన్ పై విమర్శలు | US weather presenter made to cover up dress live on air | Sakshi
Sakshi News home page

టీవీ యాంకర్ ఓవర్ యాక్షన్ పై విమర్శలు

Published Tue, May 17 2016 4:24 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

టీవీ యాంకర్ ఓవర్ యాక్షన్ పై విమర్శలు

టీవీ యాంకర్ ఓవర్ యాక్షన్ పై విమర్శలు

లాస్ ఏంజెలెస్: ప్రత్యక్ష ప్రసారంలో అమెరికా టీవీ యాంకర్ లిబర్టె చాన్ చేసిన ఓవర్ యాక్షన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. వాతావరణ వార్తలు చదువుతూ మధ్యలో ఆమె చేసిన కొంటె పనిపై సోషల్ మీడియాలో భారీగానెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. శనివారం లాస్ ఏంజెలెస్ కేటీఎల్ఏ టీవీ స్టేషన్ లో ఉదయం 8 గంటలకు వాతావరణానికి సంబంధించిన వివరాలు చూపుతూ... 'బాగా చలిగా ఉంది' అంటూ కోటు(కార్డిగాన్) తొడుక్కుంది. కెమెరా కుడివైపు నుంచి అందించిన కోటును ప్రత్యక్ష ప్రసారంలో వేసుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది.

చాన్ విన్యాసంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. లైవ్ ప్రసారంలో ఓవర్ యాక్షన్ అవసరమా అంటూ మండిపడ్డారు. ఆమె వేస్తుకున్న బ్లాక్ డ్రెస్ మీద కూడా విమర్శలు వచ్చాయి. అయితే తానేమీ తప్పు చేయలేదని, సరదా కోసమే అలా చేశానని ఫేస్ బుక్ లైవ్ చాటింగ్ లో చాన్ తెలిపింది. ఇందులో 'సెక్సిస్ట్' విన్యాసం లేదని స్పష్టం చేసింది. న్యూస్ మధ్యలో స్వెటర్ తొడుక్కోమని టీవీ ప్రొడ్యూసర్ చెప్పలేదని, సహ వ్యాఖ్యాతతో కలిసి ఇలా చేశానని వెల్లడించింది. అయితే విమర్శలు ఎక్కువ కావడంతో ఆమె క్షమాపణ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement