న్యూయార్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న రోగాల్లో చికున్ గున్యా మొదటి వరుసలో ఉంటుంది. అలాంటి ఈ చికున్ గున్యాను దీర్ఘకాలంగా నివారించడానికి ప్రస్తుతం పరిశోధకులు వ్యాక్సిన్ సిద్ధం చేశారు. మొదట్లో ఆసియా, ఆఫ్రికా, యూరోప్ దేశాలను వణికించిన ఈ వైరస్ ప్రస్తుతం అమెరికన్లను సైతం గడగడలాడిస్తోంది.
ఈ వ్యాక్సిన్ తమ పరిశోధనల్లో స్థిరమైన ఫలితాలను ఇచ్చినట్లు ఫిలడెల్ఫియాలోని విస్టర్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ కరుపయ్య ముత్తుమణి తెలిపారు. ఈయన భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త. ఈ వ్యాక్సిన్ దీర్ఘకాలికంగా కూడా ఎంతో ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ఎంతో వేగంగా వైరస్‌ను ఎదుర్కొని వ్యాధి నిరోధకతను పెంపొందించడంలో ఈ వ్యాక్సిన్ ప్రముఖ పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలాలను ఇన్‌ఫెక్షన్స్ డీసీజెస్ జర్నల్‌లో ముద్రించినట్లు తెలిపారు.
చికున్‌గున్యా టీకా సిద్ధం
Published Sat, Apr 2 2016 2:59 AM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM
Advertisement