తండ్రి చనిపోయిన గంటల్లోనే లైవ్ షో..
గ్రీస్: సాధరణంగా తండ్రి చనిపోతే ఆ భావోద్వేగాన్ని నియంత్రించుకోవడం కష్టం. ఆ ప్రభావం కనీసం వారం రోజులపాటైనా ఉంటుంది. అప్పటి వరకు ఓ రకంగా మనసు, శరీరం ఏ విధంగాను సహకరించదు. కానీ, తండ్రి చనిపోయిన గంటల్లోనే ఏ మాత్రం ఆ భావన తన ముఖంలో కనిపించనీయకుండా ఓ లైవ్ షో చేస్తే.. వానెస్సా హడ్గెన్స్ అనే టీవీ షో వ్యాఖ్యాత ఇలాగే చేసింది. ఫాక్స్ టీవీ ప్రొడ్యూస్ చేస్తున్న గ్రీస్: లైవ్ టీవీ షోలో తండ్రి చనిపోయిన గంటల్లోనే పాల్గొంది.
ముఖంలో ఏ మాత్రం ఆ బాధను కనిపించనివ్వకుండా లైవ్ కార్యక్రమంలో కెమెరా ముందుకొచ్చింది. ఇలా చేయడానికంటే ముందే ఆమె ట్విట్టర్లో తన తండ్రి చనిపోయిన విషయం కూడా తెలిపింది. 'నేను చాలా బాధపడుతున్నాను. గత రాత్రి మా నాన్న గ్రేగ్ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఆయన బ్రతకాలని ఇన్ని రోజులపాటు కోరుకున్నవారందరికీ ధన్యవాదాలు. మా నాన్నకు నివాళిగా ఈ రోజు లైవ్ ప్రోగ్రాం చేస్తున్నాను' అంటూ ఆమె ట్విట్టర్లో పెట్టి అందరి హృదయాలు కదిలించింది.