మియామీ : వయసు అయిపోయిందని కొందరు బాధపడుతూ కూర్చుంటారు. ఇంకొందరు మాత్రం వయస్సును లెక్క చేయకుండా ఇష్టమైన పనులు చేసుకుంటూ ఆనందిస్తారు. పైన ఫోటోలో యువతిలా కనిపిస్తున్న బామ్మపేరు విరా వాంగ్. ఈ మాజీ ఫిగర్ స్కేటర్ ప్రస్తుతం పెళ్లి దుస్తుల డిజైనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మియామిలో ఉంటున్న ఈ బామ్మ లాక్‌డౌన్‌తో అనేక స్టైలిష్ దుస్తులను తానేధరించి సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేసేది. పొడగాటి కాళ్లు, సన్నటి నడుము, నాజూకైన చర్మ సౌందర్యాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈమెకి నిజంగానే 70 ఏళ్ల వయస్సా అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
విరా వాంగ్ జూన్ 27న 71వ జన్మదినాన్ని జరుపుకోనుంది. పారిస్ ఫ్యాషన్ వీక్ ముగిసిన వెంటనే తన వర్క్ డే ఫ్యామిలీ టీమ్‌తో కలిసి లాక్‌డౌన్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని వాంగ్ అన్నారు. అయితే వారంతా చాలా ఫిట్‌గా ఉండేవారని, దీంతో వాళ్లను చూసి చాలా వర్క్‌అవుట్‌లు చేశానన్నారు. ఇక ఫ్యాషన్ గ్రూపులతో ఎక్కువగా సంబంధాలుండటం వల్ల ఎన్నో ఏళ్లుగా మంచి దుస్తులతో అధరగొట్టాలని అనుకున్నానని, ఇప్పుడు ఆ అవకాశం దొరికిందని అంటున్నారు విరా వాంగ్.
Comments
Please login to add a commentAdd a comment