
ఒబామా కూతురు ఏం చేస్తోంది?
న్యూయార్క్: ఒబామా పెద్ద కూతురుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. ఆమెకు స్మోకింగ్ అలవాటు ఉందా.. గంజాయి తాగుతుందా అనే అనుమానం వచ్చేలా ఆ వీడియో దర్శనం ఇస్తోంది. మొన్న ఈమధ్యనే హర్వార్డ్ విశ్వవిద్యాలయంలో హైస్కూల్ గ్రాడ్యుయేట్లో చేరిన ఒబామా పెద్ద కూతురు మలియా ఒబామాకు సంబంధించిన ఈ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో మలియా ఏదో సిగరెట్ లాంటిదాన్ని తాగుతున్నట్లు కనిపించింది. అది గంజాయి అయి ఉంటుందేమోనని పలువురు అనుమానాలు గుప్పించారు.
హార్వార్డ్ వర్సిటీలో చేరకముందు లోల్లాపలూజ అనే ఓ మ్యూజిక్ ఫెస్టివల్లో ఈ దృశ్యం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నిన్ననే ఆన్ లైన్ లో దర్శనం ఇచ్చింది. దీంతో ఆమెపై పలువురు మాటలుపేలారు. అయితే, మలియాకు పలువురు స్నేహితులు అండగా నిలిచారు. ఆమె అలాంటిది కాదని, ఆమె అంటేపడనివారే ఇలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏనాడు మలియా తానొక దేశానికి అధ్యక్షుడి కూతుర్ని అనే భావనతో స్నేహితులతో ప్రవర్తించేదికాదని, గిట్టని వాళ్లే ఇలా ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.