
ఒక్క నెలలో 252 సినిమాలు చూసేశాడు!
ఆన్‌లైన్‌లో సినిమాల్ని అందించేందుకు అనేక వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో నెలవారీ ప్యాకేజ్‌లు అందించే సైట్లూ ఉన్నాయి. అలాంటివాటిలో ఒకటి నెట్‌ఫ్లిక్స్. ఈ సైట్‌కు కొంత రుసుము చెల్లిస్తే నెల రోజులపాటు కావాల్సినన్ని సినిమాల్ని నిరంతరం ఉచితంగా చూడొచ్చు. ఇలా చాలా మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నప్పటికీ చెల్లించిన డబ్బు విలువకి తగిన సినిమాలు చూసే వారు కొందరే.
ఎందుకంటే మంత్లీ సబ్‌స్క్రైబ్ చేసుకున్నా మనం చూసే సినిమాలు ఓ పది, ఇరవై మించవు కదూ! కానీ అమెరికాకు చెందిన నటుడు, రచయిత అయిన మార్క్ మాల్కోఫ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఒక నెల పాటు సబ్‌స్క్రైబ్ పొంది ఆ నెలలో ఏకంగా 252 సినిమాల్ని చూశాడు. ఈ సైట్లో అందుబాటులో ఉండే సింప్సన్ కార్టూన్స్‌కు చెందిన సినిమాల్ని దాదాపు 404 గంటలపాటు చూశాడు. ఒకనెలలో సగటున 744 గంటలు ఉంటే ఆయన 404 గంటల్ని సినిమాలు చూసేందుకే కేటాయించాడు.