ప్రియుడిని చంపి.. ఫేస్‌బుక్‌లో వెల్లడించింది! | Woman arrested after Facebook confession about murdering her boyfriend | Sakshi
Sakshi News home page

ప్రియుడిని చంపి.. ఫేస్‌బుక్‌లో వెల్లడించింది!

Published Tue, Jan 19 2016 3:28 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

ప్రియుడిని చంపి.. ఫేస్‌బుక్‌లో వెల్లడించింది! - Sakshi

ప్రియుడిని చంపి.. ఫేస్‌బుక్‌లో వెల్లడించింది!

కాలిఫోర్నియా: 'నా మాజీ ప్రియుడితో గొడవ జరిగింది. దీంతో అతడు నా చెంపమీద కొట్టాడు. కోపంలో నేనేం చేస్తున్నానో ఆలోచించలేదు. చేతిలోకి కత్తి తీసుకొని పొడిచేశాను. అతన్ని గాయపర్చాలని అనుకోలేదు. కానీ అతడు చనిపోయాడు. నేను పరారీలో ఉన్నాను' అంటూ ఓ 18 ఏళ్ల అమెరికా యువతి ఫేస్‌బుక్‌లో చేసిన  పోస్టు కలకలం సృష్టించింది. తన ప్రియుడిని చంపి.. ఆ విషయాన్ని ఫేస్‌బుక్‌లో అంగీకరించిన నకాసియా జేమ్స్ (18) అనే యువతిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలోని హేమెట్‌ నగరానికి చెందిన నకాసియా వారం కిందట తన ప్రియుడు డొరియన్‌ పావెల్‌ (21) కత్తితో పొడిచి చంపింది. ఇంట్లో వ్యవహారాల విషయమై జరిగిన గొడవ చివరకు హింసాత్మకంగా మారి.. పావెల్‌ మృతికి దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.

బాయ్‌ఫ్రెండ్‌ చంపిన విషయమై ఆమె పెట్టిన ఫేస్‌బుక్ పోస్టును ప్రస్తుతం తొలగించారు. కానీ ప్రియుడిని చంపడంపై ఆమె తన పోస్టులో విచారం వ్యక్తం చేసింది. తాను నిజంగా అతన్ని కత్తితో పొడవాలని అనుకోలేదని, అనుకోకుండా జరిగిందని, ఇందుకు దేవుడు తనను క్షమిస్తాడని భావిస్తున్నానని పేర్కొంది. ప్రియుడి మృతికి తీవ్ర సంతాపం తెలిపింది. ఈ నెల 11న పావెల్‌  మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ప్రస్తుతం నకాసియాను అరెస్టుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement