ఒబామాను బెదిరించిన మహిళ అరెస్ట్ | Woman indicted for threatening to kill Barack Obama | Sakshi
Sakshi News home page

ఒబామాను బెదిరించిన మహిళ అరెస్ట్

Published Thu, Jan 16 2014 10:32 AM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

Woman indicted for threatening to kill Barack Obama

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను చంపేస్తానంటూ బెదిరించిన మహిళ డినైస్ ఓ నీల్ (57)ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా బుధవారం ఇక్కడ వెల్లడించింది. దేశాధ్యక్షుడు ఒబామాను హతం చేస్తానంటూ 2012, నవంబర్ 28న ఆయనకు యూఎస్ మెయిల్ ద్వారా ఓ లేఖను అందుకున్నారు. అయితే బెదిరింపు లేఖపై ఎక్కడ ఎటువంటి చిరునామా లభించలేదు. లేఖలో సంతకం కూడా  టెడ్డీ బేర్ అని మాత్రమే సంతకం చేసి ఉంది.

 

దాంతో యూఎస్ భద్రత సిబ్బంది కొంత అయోమయానికి గురయ్యారు. దాంతో అసలు విషయం తేల్చమని ఆ లేఖ దర్యాప్తు బాధ్యతను సీక్రెట్ సర్వీస్కు భద్రత సిబ్బంది బదిలీ చేశారు. దాంతో ఆ కేసు దర్యాప్తును సీక్రెట్ సర్వీసెస్ అధికారులు ముమ్మరం చేశారు. అందులోభాగంగా గతేడాది డిసెంబర్లో బెదిరింపులకు పాల్పడిన మహిళ హ్యూస్టన్ కు చెందిన డినైస్ ఓ నీల్గా గుర్తించి, 26న అరెస్ట్ చేశారు. ఆమె ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉందని మీడియా పేర్కొంది. అయితే డినైస్ ఓ నీల్ చాలా కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతుందని పోలీసులు వెల్లడించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement