♦ తీవ్రంగా ఆక్షేపించిన భారత్
♦ ఐఎస్‌పై ఉమ్మడి పోరుకు అమెరికా-ఫ్రాన్స్ నిర్ణయం
న్యూయార్క్: శరణార్థుల సంక్షోభ నివారణలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీరును భారత్ తీవ్రంగా ఆక్షేపించింది. శరణార్థులు రాకుండా సరిహద్దులు మూసేస్తున్న దేశాల్లో విదేశీయులపై ఉండే భయాన్ని పోగొట్టడడంలో విఫలమయ్యారని విమర్శించింది. కాగా, సిరియాలోని ఐఎస్ స్థావరాలు ఎక్కువగా ఉండే రాక్వా ప్రాంతంపై వైమానిక దాడులను ఫ్రాన్స్ ముమ్మరం చేసింది. ఇరాక్‌లోనూ ఇదే తరహా దాడులకు పాల్పడనున్నట్లు ఫ్రాన్స్ పేర్కొంది. మరోవైపు, పారిస్‌లో దాడుల్లో ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి చొక్కా లభ్యమైంది. ఇది కేసు పురోగతికి ఉపయోగపడుతుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. పారిస్ శివార్లలో ఉగ్రవాదులకు అపార్ట్‌మెంట్‌లో చోటు కల్పించిన యజమాని జవాద్‌ను పారిస్ పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.
అయితే ఆశ్రయం పొందిన వారు ఉగ్రవాదులన్న విషయం జవాద్‌కు తెలియదన్నారు. అయితే బెల్జియం నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారని.. వారికి ఇంట్లో చోటు ఇవ్వాలని అబౌద్ కోరినట్లు జవాద్ పేర్కొన్నాడు. పారిస్, మాలి ఘటనలు, ఐసిస్ వీడియోలపై ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా తన పౌరులకు పలు సూచనలు చేసింది. క్రీడా ప్రాంగణాలు, థియేటర్లు, బహిరంగ మార్కెట్లు, విమాన సర్వీసులను లక్ష్యంగా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉన్నందున.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే, రష్యా తన వ్యూహాన్ని మార్చుకుని.. అంతర్జాతీయ సమాజంతో కలసి పనిచేసేందుకు ముందుకు వస్తే చేతులు కలిపేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని అమెరికా స్పష్టం చేసింది. సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు రష్యా ప్రయత్నిస్తోందని.. ఇందుకు తాము సహకరించబోమని స్పష్టం చేసింది. కాగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ శ్వేతసౌధంలో సమావేశమయ్యారు. ఇరు దేశాలు కలిసి ఐఎస్‌పై ఉమ్మడి పోరు చేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు.
భద్రతామండలి వైఫల్యం
Published Wed, Nov 25 2015 2:34 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement