సాక్షి, బెంగళూరు: శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు హొసపేటె విజయనగర క్షేత్రం బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ వెల్లడించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని శనివారం బెంగళూరులో స్పీకర్‌కు అందజేయనున్నట్లు ఆనంద్‌సింగ్ తెలిపారు. నగరంలో శుక్రవారం వివిధ సమాజ నాయకులతో ఏర్పాటు చేసిన సమాలోచన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను బీజేపీ నుంచి రెండు పర్యాయాలు అధిక మెజార్టీతోనే గెలుపొందానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో ఉండటం లేదని స్పష్టం చేశారు. రానున్న అంసెబ్లీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్తిగా పోటీ చేయాలా? లేదా ఇతర పార్టీల నుంచి పోటీ చేయాలా అనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానన్నారు.
తనకు నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని.. ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేసి హ్యట్రిక్ సాధించడం ఖాయమని తెలిపారు. రానున్న బడ్జెట్‌లో నగరాభివృద్ధి కోసం రూ.120 కోట్లు, గ్రామీణ భాగం వృద్ధి కోసం రూ. 200 కోట్ల నిధులు విడుదల చేయిస్తానన్నారు. బీజేపీ పెద్దలు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి తనకు గురువని తెలిపారు. ప్రధాని మోదీగాలి వీస్తోందని అందరూ బీజేపీ పార్టీలో చేరుతున్నారని, తాను మాత్రం బీజేపీ నుంచి దూరమవుతున్నానని తెలిపారు. కాగా ఫిబ్రవరిలో ఆనంద్ సింగ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment