సాక్షి, బెంగుళూరు : దేశం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. 70 శాతానికిపైగా పోలింగ్ నమోదు అయింది. అక్కడక్కడా చిన్నా చితక సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. బనహట్టిలో ఈవీఎంల సమస్య కారణంగా రెండు గంటల పాటు పోలింగ్ నిలిపివేశారు. భారీ భద్రతల నడుమ ఓటింగ్ పూర్తైంది. అయితే బెంగళూరులోని ఆర్‌ఎంవీ 2 స్టేజ్ వద్ద ఏ పార్టీకి ఓటు వేసిన బీజేపీకే ఓట్లు పడుతున్నాయని కాంగ్రెస్ నేత బ్రిజేష్ కలప్పా ట్వీట్లు చేశారు. ఇక ఓటింగ్‌పై ప్రధాన పార్టీలు ఆందోళనలో ఉన్నా గెలుపుపై మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నకిలీ ఓటర్ కార్డుల భారీగా దొరికినందుకు ఆర్‌ఆర్ నగర్ ఎన్నిక వాయిదా పడింది. జయనగర బీజేపీ అభ్యర్థి మృతితో అక్కడ కూడా ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. మే 28న రాజరాజశ్వరినగర్ (ఆర్‌ఆర్ నగర్) అసెంబ్లీ స్థానానికి తిరిగి పోలింగ్ జరుగనుంది. ఈవీఎంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా హెబ్బల్ నియోజవర్గంలోని లొట్టెగొళ్లహల్లిలో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment