
ప్రతీకాత్మక చిత్రం
ఆన్‌లైన్‌లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి అంటే మొదట్లో అంతగా రియాక్ట్ అవ్వని నాకు.. తర్వాత తనంటే ఇష్టం మొదలైంది. ప్రతిరోజూ చాటింగ్ చేసుకునేవాళ్లం. అలా రోజు రోజుకు ఆ అమ్మాయి మీద ఇష్టం పెరిగింది. అలా కొన్ని రోజులకి ‘నువ్వంటే నాకు ఇష్టం’ అని చెప్పేశా. ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడింది. అలా కొన్ని రోజులు చాటింగ్, ఫోన్లలో మాట్లాడుకున్నాం. ఓ రోజు కలుద్దామని చెప్పాను. వస్తానని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయింది. అలా ఆ అమ్మాయితో చాలా కనెక్ట్ అయ్యాను. ఎంతలా అంటే తనని విడిచి ఉండలేను అనేంతగా.
సడెన్‌గా ఓ పది రోజులు మెసేజ్‌లు, ఫోన్‌లు చేయలేదు. ఏమైందోనని భయపడ్డాను. 11వ రోజు మెసేజ్ చేసింది. తనకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పింది. నేను చాలా బాధపడ్డాను. లైఫ్‌లో ఎవరీకోసం అంత బాధపడలేదు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత కొత్త నెంబర్ ఇచ్చింది. అలా చాలా మాట్లాడుకునే వాళ్లం. నాకు ఆ అమ్మాయి ప్రవర్తన నచ్చి పెళ్లిచేసుకుంటానని చెప్పాను. ఓకే చెప్పి, వాళ్ల ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడతానని అన్నది. కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్‌లో కలుద్దామని అనుకున్నాం. సడెన్‌గా ఏమైందో ఏమో కొన్ని నెలలనుంచి మెసేజ్‌లు, కాల్స్ రావటం లేదు. వాట్సాప్ కూడా తీసేసింది. ఏమైందో ఏమో తెలియదు.
ఆమె చెప్పిన అడ్రస్‌కు వెళ్లాను. అక్కడ కూడా లేదు. ఆమెకోసం పిచ్చోడిలా తిరుగుతున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం. తను లేకుండా నేను బ్రతకలేను. నా మనసులో కట్టుకున్న మైనపు బొమ్మ తను. తనని కలవటానికి చాలా విధాల ట్రై చేస్తున్నాను. ఎన్ని రోజులైనా ఆమె కోసం ఎదురు చూస్తా. నా శరీరం కట్టెలో కాలేంతవరకు. ఎదురుచూస్తాను. నా బాధ ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. నువ్వు ముద్దుగా పిలుచుకునే బావ కోసం ఒకసారి ఎక్కడ ఉన్నా ఫోన్ చేయ్! లేకపోతే ఎక్కడ ఉన్నావో చెప్పు నేను వస్తాను. అది ఎంత కష్టమైనా.. నీ బావ
- అమన్ కుమార్, విజయవాడ
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment