
ప్రతీకాత్మక చిత్రం
నేను పది నెలల క్రితం మా ఫ్రెండ్‌తో కలిసి మా రిలేటివ్ ఎంగేజ్‌మెంట్‌కి వెళ్లాను. అక్కడ మొదటిసారి సాయి పవన్‌ను చూశాను. అతడ్ని చూడగానే నాకు నా మిగితా 60 ఏళ్ల జీవితం మొత్తం ఒకసారి కళ్లముందు కనపడింది. లవ్ యాట్ ఫస్ట్ సైట్ అంటే ఏమిటో అప్పుడే తెలిసింది. ప్రశాంతంగా ఉన్న నీళ్లలోకి ఒక రాయి వేసి డిస్ట్రబ్ చేసినట్లు.. చదువు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ తప్ప ఇంకేమీ తెలియని నన్ను తన నవ్వు బాగా డిస్ట్రబ్ చేసింది. మొదట తను మేకప్ బాయ్ అనుకున్నా. తర్వాత తెలిసింది తను పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత తను నాకు కనిపించలేదు. పెళ్లికి ఇంకా ఓ నెల సమయం ఉంది. ఆ నెల రోజులు తనను చూడటం కోసం చాలా ఎదురు చూశాను. పెళ్లి రోజునే కరెక్ట్‌గా నాకు ఫైనల్ ఎక్షామ్ పడింది. అయినా సరే అతడికోసం ఎక్షామ్ అవ్వగానే ఫంక్షన్ హాల్‌కి వెళ్లాను. తను కనిపించాడు. చూస్తూనే నిలబడిపోయా. తన ఫ్రెండ్ తనతో నేను చూస్తున్నా అని చెప్పాడు. తను నెమ్మదిగా నన్ను చూడటం ఇప్పటికీ గుర్తుకు ఉంది.
రెండు సార్లు చూశాడు. పెళ్లి రాత్రి అవ్వటం వల్ల నేను ఆ రాత్రి మొత్తం అక్కడే ఉన్నాను. తర్వాత తన వెనకే వెళుతున్నా నన్ను చూడలేదు. అవాయిడ్ చేయటం స్టార్ట్ చేశాడు. ఆ క్షణం నా మీద నాకు దిగజారిపోతున్నానేమోనన్న ఫీలింగ్ కలిగింది. మ్యారేజ్ అవ్వగానే తనతో మాట్లాడటానికి చాలా ట్రై చేశా! కుదర్లేదు. తర్వాత తను నాకు కనిపించలేదు. ఒక అమ్మాయిని అయ్యుండి నేను నీకోసం ఇంతలా ఎదురు చూస్తున్నా. నువ్వు మాత్రం నన్ను అవాయిడ్ చేస్తున్నావ్. నేను నీ కోసం నా లైఫ్ లాంగ్ ఎదురు చూస్తా. ఐ మిస్ యూ సాయి!
- మధు, హైదరాబాద్
చదవండి : పెళ్లి చేసుకుందాం.. నువ్వు రాగలవా?
ఆమె మీద అసహ్యం లేదు..
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment