
ప్రతీకాత్మక చిత్రం
నేను నా మరదల్ని ప్రేమించాను. అప్పుడు తను పదవతరగతి చదువుతోంది. అప్పుడే తనకు ప్రపోజ్ చేశా. సైలెంట్‌గా వెళ్లిపోయింది! ఇష్టం లేదేమో అనుకున్నా. తనను డిస్ట్రబ్ చేయటం ఇష్టంలేక 7 సంవత్సరాలు వన్ సైడ్‌లవ్ చేశా. నాన్న గారు చనిపోవటంతో కుటుంబ బాధ్యతలు నా మీద పడ్డాయి. అందుకే తనకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. 2018 డిసెంబర్‌లో వాళ్ల అమ్మతో తనంటే నాకిష్టమని, పెళ్లి చేసుకుంటానని మాట్లాడాను. వాళ్లు ఒప్పుకున్నారు. కానీ, నెల రోజులు గడిచినా ఏం సంగతి చెప్పలేదు. ఆ తర్వాత ఆ విషయం వాళ్ల తమ్ముడికి చెప్పా. వాడు హ్యాపీగా ఫీలై వాళ్ల అక్క నెంబర్ ఇచ్చాడు.
‘లవ్ యూ! మనం పెళ్లి చేసుకుందాం’ అని మెసేజ్ చేశా. తను నా నెంబర్ బ్లాక్ చేసింది. నాకు ఏడుపొచ్చింది. తర్వాత కొన్ని రోజులు వేయిట్ చేశా. ఫిబ్రవరి 14న కొత్త నెంబర్ నుంచి మళ్లీ ప్రపోజ్ చేశా. తను రిప్లై ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు నా నెంబర్ బ్లాక్ చేయలేదు. అలా మూడు నెలలు తనకు మెసేజ్‌లు చేశా. మెసేజ్‌లు చూస్తుంది కానీ, రిప్లై ఇవ్వటం లేదు. సడెన్‌గా మే 27 రాత్రి 12గంటలకు ‘ఐ లవ్ యూ టూ’ అని మెసేజ్ చేసింది. మార్నింగ్ మెసేజ్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా. అలా ఆరు నెలలు హ్యాపీగా ఉన్నాం. ఏమైందో ఏమో ఓ రోజు ఫోన్ చేసి‘ నువ్వు నాకు వద్దు. లెట్స్ బ్రేకప్’ అంది. నా ప్రాణం పోయినంత పనైంది. తేరుకుని‘ ఏమైంది చెప్పు!’ అని అడిగాను.
సమాధానం లేదు. తను పని చేసే కంపెనీలో మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లని తన గురించి అడిగాను. వాళ్లు తన గురించి కొంచెం బ్యాడ్‌గా చెప్పారు. అక్కడ ఆఫీస్‌లో తనకు ఆల్‌రెడీ ఓ లవర్ ఉన్నాడు. అతడినే పెళ్లి చేసుకుంటుందంట. ఆ విషయం తననే అడిగా. అప్పుడు తను‘ అది నా ఇష్టం.. నువ్వు ఎవడ్రా అడగటానికి’ అంది. నా జీవితం అనుకున్న అమ్మాయి ఇలా మాట్లాడుతుందని అనుకోలేదు. ఆమెను మర్చిపోలేక రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశా. ఫ్రెండ్స్ నన్ను బ్రతికించారు. అమ్మ కోసం బ్రతికున్నా. ఆమె సంతోషంగా ఉండాలని, తన లవర్‌తోనైనా పర్మినెంట్‌గా ఉండాలని కోరుకుంటున్నా. మిస్ యూ బంగారం.. నీ బావ..
- వెంకీ
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment