
ప్రతీకాత్మక చిత్రం
నేను తనని ఒక ఫంక్షన్‌లో చూశా! చూడగానే నచ్చేసింది. అప్పుడు తను ఎవరో నాకు తెలియదు. తర్వాత మా పిన్ని వాళ్లు తనని చూపిస్తూ నా మరదలని చెప్పారు. మా మమ్మీ వాళ్ల అన్న కూతురు అని అప్పటి వరకు నాకు తెలియదు. మా ఫ్యామిలీ ఫ్రాబ్లమ్స్ వల్ల మా మామయ్య వాళ్లతో మాటలు ఉండేవి కావు. చిన్నప్పటినుంచి మా మామయ్యను చూడటం అదే మొదటిసారి. తను నా మరదలని తెలియగానే ఎగిరిగంతేయాలనిపించింది. నాకు అప్పటివరకు ఆమె పేరు కూడా తెలియదు. పేరేంటని డైరెక్ట్‌గా అడిగాను. అప్పుడు తను నన్ను చూస్తూ వింధ్య అని చెప్పింది. ‘నేను ఎవరో నీకు తెలుసా?’ అని అడిగాను. తెలుసంది. అలా మా మొదటి పరిచయం జరిగింది. ఫంక్షన్ అయిపోయింది. మేము ఎవరి ఇళ్లకు వాళ్లము వెళ్లిపోయాము. కానీ, నేను తనని మర్చిపోలేకపోయాను. అలానే ఒక సంవత్సరం గడిచిపోయింది. సడెన్‌గా ఒక రోజు అన్‌నౌన్ నెంబర్‌నుంచి ఫోన్ వచ్చింది.
‘బావ నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అంది. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పాను. అలా ఐదేళ్లు మా ప్రేమ హ్యాపీగా సాగిపోయింది. ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం, కలిసే వాళ్లం. సడెన్‌గా తను నన్ను అవాయిడ్ చేయటం మొదలుపెట్టింది. ఫోన్ చేస్తే కట్ చేసింది. నా నెంబర్ బ్లాక్ చేసింది. అలా ఎందుకు చేస్తుందో తెలుసుకోవటానికి మా ఫ్రెండ్‌ను పంపించాను. ‘నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. తనను కాల్ చెయోద్దని చెప్పు’ అని అంది. అప్పుడు నా మనసు పగిలిపోయినంత పనైంది. వాళ్ల ఇంటికి వెళ్లి తనను నాకిచ్చి పెళ్లిచేయమని అడిగాను. దానికి వాళ్లు‘నీకేముందని నా కూతుర్ని నీకివ్వాలి. వాడికి కానిస్టేబుల్ జాబ్ ఉంది. మరి నీకేముందని ఇవ్వాలి’ అని అడిగారు.
ఆ తర్వాత తనను కలిసి పారిపోయి పెళ్లి చేసుకుందాం అని అడిగాను. అందుకు తను ‘నేను రాను! అతడికి గవర్నమెంట్ జాబ్ ఉంది. నీకు జాబ్ లేదు ఏమీ లేదు.’ అంది. ఆ తర్వాత ఆమె పెళ్లి జరిగిపోయింది. 2015-2016లో సివిల్ ఎస్‌ఐ జాబ్ వచ్చింది. జాబ్ లేనప్పుడు తను నాతో ఉంది! జాబ్ వచ్చిన తర్వాత లేదు. కో ఇన్సిడెంట్ ఏంటంటే! వాళ్ల భర్త పనిచేసే పోలీస్ స్టేషన్‌కు నేను ఎస్‌ఐగా వెళ్లాను. ఒక రోజు వాళ్లు ఉండే ఏరియాకు పాట్రోలింగ్‌కు వెళితే ‘ సార్! మా ఇళ్లు పక్కనే. అక్కడ కాఫీ తాగి వెళదాం రండి’ అన్నాడు. నేను వెళ్లాను. ఇంటికి వెళ్లాక తెలిసింది తను నా మరదల్ని చేసుకున్న వాడని. మా సార్ అంటూ నన్ను తనకు పరిచయం చేయగానే ముఖం ఎత్తుకుని చూడలేకపోయింది. ఎంతైనా గాడ్ ఈజ్ గ్రేట్.. ఇప్పుడు గ్రూప్ 2 వచ్చింది.
- అనిల్ కుమార్, జహీరాబాద్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment