
ప్రతీకాత్మక చిత్రం
పీజీ చదివే మొదటి సంవత్సరం! అన్నయ్యా అని ఆప్యాయంగా పలకరించింది. నేను కూడా ఏ కల్మషం లేకుండా తనతో మాట్లాడా. పరిచయం బాగా పెరిగింది. తనతో కలిసి గుడికి వెళ్లటం, అలా వెళ్లిన ప్రతీసారి ఎవడో ఒకడు నా చెప్పులు కొట్టేయటం జరిగేది. అలా గడిచిపోతోంది కాలం. క్రమక్రమంగా నాకు తెలియకుండా తనతో! ప్రేమ అని చెప్పలేను కానీ, ఏదో ఒక ధృడమైన, ప్రవిత్రమైన అనుబంధం ఏర్పడుతోందని అనిపించింది. మొదటి సంవత్సరం సంక్రాంతి సెలవులకు తనని ట్రైన్ దాకా వదలమని అడిగింది. నేను వెల్లడానికి ప్రయత్నించా, ట్రైన్ వెళ్లాక స్టేషన్‌లోకి చేరుకున్నా. తను వెళ్లిపోయింది. నా కళ్లలో నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. ఎందుకో అర్థం కాలేదు.
ఆ విషయం తన ఫ్రెండ్ చూసి తనతో చెప్పింది. నాకోసం ఏడ్చావా అని అడిగితే అలా ఏం లేదని అబద్ధం చెప్పా. అప్పటినుంచి తను నన్ను రిసీవ్ చేసుకునే విధానం మారింది. నా కోసం తన హాస్టల్‌నుంచి భోజనం తేవటం, నాతోపాటు బస్‌లో రావటానికి ప్రయత్నించటం, నాతో ఎక్కువ సేపు మాట్లాడటానికి ప్రయత్నించటం లాంటివి చేసేది. ఇవన్నీ చూశాక తను నన్ను ప్రేమిస్తోందని అర్థం అయింది. ఆ విషయం తనను అడిగితే మా స్నేహం దెబ్బతింటుందని అడగలేదు. సెకండ్ ఇయర్‌లో డిసెంబర్ 31 రోజు రాత్రంతా మేల్కొని నాకు లెటర్స్ రాసింది. తన ఫ్రెండ్‌తో ఇచ్చి పంపింది. నాకు అర్థమై దూరం వెళుతున్నా అర్థం చేసుకోదు, వినదు, మొండితనం, అమాయకత్వం, ప్రేమ, కోపం, బాధ, అన్నీ చూపించేది. నేను పీజీకి ముందే ఓ అమ్మాయిని ప్రేమించాను.
తను వేరే కాలేజీ. ఆమె కూడా నన్ను ప్రేమిస్తున్నా కుటుంబ కారణాల వల్ల చెప్పుకోలేక పోయాం. కానీ, అర్థం చేసుకుని అలాగే ఉన్నా. కాలేజీలో నన్ను ప్రేమిస్తున్న అమ్మాయికి లావణ్యతో మా ప్రేమ విషయం చెప్పించాను. అది కూడా తనను నానుంచి దూరం చేయటానికి! అపద్ధం చెబుతున్నా అనుకుంది. నాలో కోపం కట్టలు తెచ్చుకుంది. ఈ పిచ్చి పిల్ల ఇంకా ప్రేమ పెంచుకుంటుందని చెడామడా తిట్టేశా!అయినా వినలేదు. నా ఫ్రెండ్స్‌తో నాపై బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలాగా చేశా! అయినా వినలేదు.
నా కోసం ఐదు సంవత్సరాలు వేయిట్ చేస్తానంది. పిచ్చింది! ఎంత పిచ్చిదో కదా! ఈ కాలంలో నేను దేవుళ్లని చూడలేదు కానీ, తను మాత్రం నా జీవితంలోకి వచ్చిన దేవత, పవిత్ర జ్వాల తనని మోసం చేయాలనిపించలేదు. తనకు నేను సరికానివాడను. తనకు మంచి భర్త, భవిష్యత్ కావాలని దూరం అయ్యాను. అంతే తప్ప ఎలాంటి దురుద్దేశ్యం లేదు. తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా. ఇప్పటికీ, ఎప్పటికీ నా దేవతను ఆరాధిస్తూ ఉన్నాను! ఉంటాను. నిన్ను దూరం చేసుకున్నందుకు, ఇబ్బంది పెట్టినందుకు నీ పాదాల ‘‘సాక్షి’’గా నన్ను క్షమించు అచ్చులు.
- శ్రీనివాస్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment