
ప్రతీకాత్మక చిత్రం
నేను తొమ్మిదవ తరగతిలో ఉండగా ఇంటి ముందు ఉండే అబ్బాయి ప్రపోజ్ చేశాడు. ఏమీ తెలియని వయసు.. ఆకర్షణ కారణంగా అతడికి ఓకే చెప్పేశా. అలా స్టడీస్ కొనసాగిస్తూ వచ్చాం. అదేంటో తెలియదు కానీ, నేను అతడ్ని ఓకే చేసినా అతడి మీద ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. ఒకరోజు ఇద్దరికీ పెద్ద గొడవ జరిగింది. ఎంతలా అంటే లైఫ్‌లో మళ్లీ మేము కలువకూడదు అనుకునేంతలా. ఆ తర్వాత ఇద్దరం విడిపోయాం. చాలా హ్యాపీగా వెళ్లిపోతోంది లైఫ్. బీటెక్ జాయిన్ అయ్యాను. అప్పడు వేరే ఫ్రెండ్ ద్వారా ఒకతను పరిచయం అయ్యాడు. ఇద్దరం సేమ్ కాలేజ్. తను డిగ్రీ, నేనేమో బీటెక్. ఊహించని విధంగా ఇద్దరి ఇళ్లూ దగ్గరే.. పైగా ఇద్దరి పుట్టిన రోజులు ఒకే నెలలో. సడెన్‌గా ఒకరోజు ప్రపోజ్ చేశాడు. నేను రెండు రోజుల టైం అడిగాను. ఆ తర్వాత ఒప్పుకున్నా. తనని చూస్తే ఎంతో సంతోషంగా ఉండేది. మేమిద్దరం కలుసుకున్నది, మాట్లాడుకున్నది చాలా తక్కువసార్లు. అసలు ఏమీ చెప్పకుండా డిగ్రీ అయిపోగానే వెళ్లిపోయాడు.
నాకు ఎప్పుడూ తన జ్ఞాపకమే. నా మనసు డిగ్రీ అబ్బాయి మీద ఉంటే నన్ను వదలి ఉండలేనని మొదట నాకు ప్రపోజ్ చేసిన అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. రెండేళ్ల తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పి.. నన్ను మొదట ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకున్నా. తను బాగానే చూసుకుంటున్నాడు. నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ప్రతి రోజూ చస్తూ బ్రతుకుతున్నా. తను గుర్తుకు వస్తూనే ఉన్నాడు. అతడ్ని మర్చిపోవటానికి కెరీర్‌ను మంచిగా బిల్డప్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నా. నేను పడుతున్న నరకం ఎవరూ పడకూడదు. మనల్ని ప్రేమించే వాళ్లకంటే మనం ప్రేమించే వాళ్ల దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటాం. అది ఎంత కష్టమైనా. ఎందుకంటే మన మనసు వాళ్ల దగ్గర ఉంది కదా!
- శ్రావణి
చదవండి : విడిపోయి బ్రతకలేం! అర్థం చేసుకోండి
అతడి కోసం లైఫ్‌లాంగ్ ఎదురుచూస్తా!
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment