
ప్రతీకాత్మక చిత్రం
మాది నెల్లూరు జిల్లాలో సూర్యపాలెం గ్రామం. మా ఊరు అన్నా అక్కడి మనుషులు అన్నా నాకు చాలా ఇష్టం. అంతమంచి వాళ్లు. నేను లవ్ చేసిన అమ్మాయి ముస్లిం. మా ఊరులో ముస్లింలు చాలా మంచివారు. నాకు వాళ్లంటే చాలా ఇష్టం. మా ఊరిలో ఓ ముస్లిం అమ్మాయిని లవ్ చేశాను. పిచ్చిగా లవ్ చేశాను. ఆ అమ్మాయి కూడా నన్ను పిచ్చిగా లవ్ చేసింది. ఎంతంటే.. నేను కనిపించకపోయినా, ఓ నిమిషం మాట్లాడకపోయినా ఒప్పుకునేది కాదు. అంతలా ప్రేమించింది నన్ను. నన్ను పెళ్లి చేసుకోమంటూ డైలీ అడిగేది. చేసుకుంటానని చెప్పినా వినేది కాదు. అప్పటికి తను మైనర్. మైనారిటీ తీరటానికి ఇంకా నాలుగు నెలలు ఉంది. మైనారిటీ తీరితే చేసుకుంటాను అన్నా వినలేదు. నా కోసం తనను తాను బాధించుకునేది. ఏమ్ చేయాలో అర్థం కాలేదు. తనకు ఆవేశం ఎక్కువ. ఒకరోజు ఇద్దరం ఇంట్లోంచి వెళ్లిపోయాం. ఎలాగోలా బ్రతుకుదామని విజయవాడకు వెళ్లాం. కానీ, అక్కడ మా మామవాళ్లకు ఫోన్ చేస్తే బాగా తిట్టారు. మైనర్ బాలికను ఎలా తీసుకొచ్చావ్ అని. మరో వైపు ఆ అమ్మాయి వాళ్లు మా ఇంటి మీదకు పోయి గొడవచేస్తూ గందరగోళం చేశారు.
ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇంటికి ఫోన్ చేశాము ఇద్దరం. ఇంటికి రాకపోతే మా వాళ్లను చంపేస్తాం అని చెప్పేసరికి ఆ అమ్మాయికి ఏదో సర్ధి చెప్పి ఇంటికి తీసుకెళ్లాను. ఆ అమ్మాయి బాధతో కోపంగానే ఇంటికి వెళ్లింది. నా లైఫ్ రోడ్డుమీద పడిపోయింది. ఇంటికి పోలేక చాలా బాధపడ్డాను. అమ్మాయి లైఫ్ బాగానే ఉంటది. అబ్బాయిలే ఇబ్బందిపడేది. అంతలా ప్రేమించిన అమ్మాయి నువ్వునాకు వద్దు అంటూ ఫోన్ చేసింది. బాధతో చెప్పలేనంత టార్చర్ అనుభవించాను. నీ కోసం లైఫ్ అంతా ఎదురు చూస్తుంటాను. ఐ లవ్ యూ బంగారం.
- మాల కొండయ్య, నెల్లూరు
చదవండి : ప్రేమ కావాలి.. పెళ్లి వద్దు!
అన్నీ భరించాం.. అప్పులు కూడా తీర్చాం
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment