
ప్రతీకాత్మక చిత్రం
నేను పది పాసై డిప్లమా జాయిన్ అవుతున్న రోజులు. సీట్ కోసం చాలా ట్రై చేశా. సమైకాంద్ర గొడవల కారణంగా సీట్ రావటం చాలా ఆలస్యం అయ్యింది. చివరికి శ్రీకాకుళం కాలేజీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ హాస్టల్. కాలేజ్లో చేరిన ఓ మూడు నెలలకు ఒక మెసేజ్ వచ్చింది. అది మా అత్తయ్య కూతరు. నేను హాస్టల్‌లో ఉంటున్నానని తెలిసి తను నాకు మెసేజ్ చేసింది. తను తొమ్మిదవ తరగతి సరిగా చాటింగ్‌కూడా చేయటం రాదు. పది అయిపోయేలోగా చాటింగ్ చేయటం నేర్పించాను. పదవ తరగతి పాసవ్వగానే తనకు నేను ప్రపోజ్ చేశాను. నేను తనని పెళ్లి చేసుకుంటానని మా నాన్నకు కూడా చెప్పాను.
మా నాన్న చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. అలా నాలుగేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం. డిగ్రీ ఫైనల్ ఇయర్ అవ్వగానే మా నాన్నగారు మరణించారు. అప్పటినుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆమె ఇంట్లో వాళ్లు కూడా రివర్స్ అయిపోయారు. తనను నాకిచ్చి పెళ్లి చేయమని చెప్పారు. నేను ఎలాగైనా డబ్బు సంపాదించి తనను పెళ్లి చేసుకోవాలనే తపనతో ఉండేవాడిని. అలా ఉంటున్న సమయంలో నాకు బాధ్యత ఎక్కువ అయింది. టెన్షన్స్ మొదలయినా ఓర్చుకున్నాను. చివరికి పెళ్లి చేసుకుందాం అని వాళ్ల అమ్మకి కాల్ చేశాను.
‘నువ్వు ఎంత సంపాదించినా నీకు మాత్రం మా అమ్మాయిని ఇవ్వము’ అని చెప్పేసింది. చాలా ప్రయత్నాలు చేశాను ఒప్పించడానికి. చాలా కష్టపడ్డాను కానీ ఆఖరికి విడిపోవాల్సి వచ్చింది. ఏదేమైనా ఎప్పటికి మా అమ్మని తనలోనే చూసుకుంటాను. తను కూడా నన్ను డాడీ అని పిలుస్తుంది. ప్రేమ కోసం ఓడిపోయాం, విడిపోయాం కానీ మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉండాలని ఫిక్స్ అయ్యాం. మంచి స్నేహితుల్లాగా ఫ్రెండ్షిప్ అని మేము అనుకోవడం లేదు. మా ఫ్యామిలీస్ వల్ల మేము పడే బాధ మాకు తప్ప ఎవరికీ ఎప్పటికీ అర్థం కాదు.
- కిరణ్ రూపక్, వైజాగ్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment