
ప్రతీకాత్మక చిత్రం
మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. అన్నయ్య చదివించే వారు. నేను డిగ్రీ థర్డ్ ఇయర్ చదివే రోజుల్లో.. కాలేజ్ స్టార్ట్ అయి ఒక నెల రోజులు కావస్తోంది. నేను కాలేజ్‌కు వెళ్లా. ఆ రోజు కాలేజ్ అంతా రంగుల ప్రపంచంలా ఉంది. ఫ్రెషర్స్ జాయిన్ అవ్వటంతో కాలేజ్ కళకళలాడుతూంది. కొద్దిసేపటి తర్వాత క్లాస్ స్టార్ట్ అయ్యింది. సార్! చిన్న డౌట్ అన్న వాయిస్.. ఎవరో జూనియర్. కెమిస్ట్రీ సార్ సమాధానం చెప్పారు. తను వెళ్లిపొయింది. అమ్మాయ్ మాత్రం సూపర్‌గా ఉంది. వెంటనే మా సార్ ‘ఈ క్లాస్‌లో ఒక్కరికీ డౌట్ రాదు! మహానుభావులు.. మళ్లీ సీనియర్లు’. అన్నారు. నేను క్లాస్‌లో చాలా సరదాగా ఉంటా. అప్పుడు నేను ‘సార్! మా బావకి అలా డౌట్ వచ్చే సబ్జెక్టులు పది ఉన్నాయ్ ’ అన్నా మా ఫ్రెండ్‌ని చూపిస్తూ. అందరు పగలబడి నవ్వారు. సార్ నన్ను మర్యాదగా బయటకు వెళ్లమన్నారు. ఎలాగో వెళ్లమన్నారు కదా అని బయట అటు ఇటు తిరగటం ప్రారంభించాను.
ఎందుకో ఒక సారి ఆ అమ్మాయిని చూడాలనిపించింది. ప్రతి క్లాసు తిరిగా బైపీసీ ఫస్ట్ ఇయర్‌లో ఉంది. ఎందుకో ఆమెను చూడంగానే నాకు నచ్చింది. ప్రతి రోజు తను ఇంటి నుంచి బయలుదేరి కాలేజ్‌కి వచ్చే వరకు తనను ఫాలో అయ్యేవాడిని. చాలా థ్రిల్లింగా ఉండేది. తరువాత ఆరు నెలలు తన వెంటపడి ఓసారి ప్రపోజ్ చేశా! రిజెక్ట్ చేసింది. రోజూ ఆమె నామస్మరనే. మళ్లీ ఒక నెల తర్వాత లెటర్ రాసి ఇంకెప్పుడూ డిస్టర్బ్ చేయనని చెప్పా. అప్పటి వరకు ఫాలో చేసినందుకు స్వారీ చెప్పా. 2 డేస్ తరువాత నైట్ తనే కాల్ చేసింది. నువ్వంటే ఇష్టం అంది. కానీ, చిన్న కండీషన్ పెట్టింది. ‘మన లవ్‌ని మా అమ్మానాన్న ఒప్పుకోవాలి’ అంది. సరే అన్నా.
ఆనందానికి అవధుల్లేవ్. కలిసి తిరిగాం. ఈ లోపు నా డిగ్రీ అయ్యింది. రోజూ కాల్ చేసుకునే వాళ్లం. ఈ లోపు మా ఫ్యామిలీలో గొడవలు, ఆర్థికంగా ఇబ్బందుల పాలయ్యాము. జాబ్ చేయాలి, తనని పెళ్లి చేసుకోవాలి. తన చదువు ఇంకా పూర్తి కాలేదు. నేను ఇంక సెటిల్ అవ్వలేదు. కానీ, తను చాలా మంచిది. తనకి కోపం తక్కువ. తను స్నేహ ఉల్లాల్‌లా ఉంటుంది. కొన్నాళ్లకి తనకి పెళ్లి సెట్ అయ్యింది. మా కులాలు వేరు, నేను ఆర్థికంగా వీక్. తనింట్లో ఒప్పుకోలా.. మా ఇంట్లో నేను చెప్పలా. మా ఊరిలో ఉంటే తనని చూడాలని ఉంటుందని హైదరాబాద్ వెళ్లి 3 నెలలు ఉండి వచ్చా. నాకు దగ్గర సంబంధం వచ్చింది. పెళ్లై 3 సంవత్సరాలు! ఒక బాబు. నా లవ్ ఓ ఙ్ఞాపకంగా ఇంకా మిగిలే ఉంది. తను ఎక్కడ ఉన్నాహ్యాపీగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేనే. తల్లి తండ్రులను గౌరవించే తన నిర్ణయానికి హాట్సాప్.
- సాయి
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment