
ప్రతీకాత్మక చిత్రం
లవ్ ఆట్ ఫస్ట్ సైట్ అంటే అది ఏదైనా సరే! అందరికీ ఒకేలా వర్తిస్తుందనుకుంటా. నేను 5వ తరగతి చదువుతున్నపుడు కిషోర్ మా స్కూల్‌లో కొత్తగా జాయిన్ అయ్యాడు. నా ఫ్రెండ్ తనని పరిచయం చేసింది. అతన్ని చూసిన మొదటి చూపులోనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అతడి ప్రవర్తన, వ్యక్తిత్వం.. అంటే మా స్కూల్ మగపిల్లలు చాలా అల్లరి చేసేవాళ్లు కానీ, అతడు చాలా డిఫరెంట్. నేను అతనికి ఇంకా అట్రాక్ట్ అయ్యాను. 8వ తరగతి వరకు అతడు నాతో బాగానే మాట్లాడేవాడు. అప్పట్లో నేను క్లాస్ ఫస్ట్ అతడు బిలో యావరేజ్. తను తెల్లగా ఉంటాడు! నేనేమో నల్లగా ఉంటాను. రోజులు గడిచేకొద్ది అతడి మీద ఇష్టం పెరుగుతూ వచ్చింది. అదేపనిగా తనని చూడటం.. అతడి డ్రెస్ కలర్, నా డ్రెస్ కలర్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవటం. సేమ్ కలర్ నోట్ బుక్స్, పెన్స్ వాడటం ఇలా ఎన్నో చేశాను. మా క్లాస్‌లో కేవలం 12మంది మాత్రమే ఉండేవాళ్లం. తనకు నా విషయం అర్థం అయ్యింది. అందుకే నాతో కొంచెం దురుసుగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు.
నాకు నచ్చని పనులు అదేపనిగా చేసేవాడు. అది కాస్తా 10వ తరగతికి వచ్చేసరికి తన ప్రవర్తన అసలు ఎప్పుడూ చూడని విధంగా మారిపోయింది. కిశోర్‌పై ఇష్టం కారణంగా 9వ తరగతి నుంచి నా చదువులు అటకెక్కాయి. మా తల్లిదండ్రులు, టీచర్లు నేను టెన్త్ ఫస్ట్ వస్తానని అనుకున్నారు. వారి ఆశలు నాశనమైపోయాయి. టెన్త్ ఎక్షామ్స్ అయిన వెంటనే డిసైడ్ అయ్యా! తనని మర్చిపోవాలని. కానీ, 10 ఏళ్లు అవుతోంది తనని చూడక. ఇప్పటికీ తను గుర్తుకువస్తాడు. ప్రతి రోజూ స్కూల్ డేస్ మెమొరీస్ గుర్తుకు వస్తాయి. నా జ్ఞాపకాలు, కలలు అన్నీ అతడే..
- లక్ష్మీ
చదవండి : ప్రేమించిన తన కోసం తననే వదిలేశాను
ప్రతీ అమ్మాయి వెంట పడేవాడిని.. కానీ..
Comments
Please login to add a commentAdd a comment