
ప్రేమ అంటే ఏదో తెలియని ఫీలింగ్! అది పొందాలంటే అదృష్టం ఉండి తీరాలి. నేను ఇంటర్‌లో జాయిన్ అయిన మొదట్లో బస్‌లో ఒక అబ్బాయిని చూశాను. కాలేజ్‌కు వెళుతున్నపుడు బస్‌లో చాలాసార్లు చూశాను . కానీ, నాకు అప్పుడు అర్థం కాలేదు! నేను ప్రేమిస్తున్నానని. తర్వాత నేనే తనకు మెసేజ్ చేశాను. అలా చాలా రోజులు మాట్లాడుకున్నాం, కలుసుకున్నాం. తనకు నేనంటే ఇష్టం ఉందో లేదో తెలియదు కానీ, నాకు అతడంటే చాలా ఇష్ట. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కొన్ని మిస్టేక్స్ వల్ల ఇప్పుడు విడిపోయాం. తను మాట్లాడటం లేదు. చాలా బాధగా ఉంది. ‘అమ్మాయిలు లవ్ చేస్తే బ్రేకప్ అయిన తర్వాత మర్చిపోతారు’ అంటారు కానీ, వాళ్లు నిజంగా ప్రేమిస్తే వాళ్ల ప్రేమ అమ్మ ప్రేమతో సమానం అవుతుంది. ఐ లవ్ యూ అండి, ఐ మిస్ యూ.. మీ..
- మధు
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment