ఆమెను కొట్టి, రోడ్డు మీద వదిలేశాడు | Telugu Real Life Triangle Love Story of Ramesh | Sakshi
Sakshi News home page

నువ్వంటే ఇష్టమే పెళ్లి చేసుకోలేను అనేది

Published Thu, Oct 31 2019 10:30 AM | Last Updated on Thu, Oct 31 2019 12:57 PM

Telugu Real Life Triangle Love Story of Ramesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

7 నెలల క్రితం ఓ సాయంత్రం మా అమ్మ చెప్పడంతో కూరగాయల కోసం మార్కెట్‌కి వెళ్లాను. అప్పుడు సాయంత్రం 5.30 అవుతోంది. కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తుండగా దారిలో ఓ అమ్మాయి ఏదో వెహికిల్‌ కోసం ఎదురుచూస్తూ కనిపించింది. నేను ఆ వైపు రావడంతో ఆమె నన్ను హైవే వరకు లిఫ్ట్‌ అడిగింది. ఎందుకంటే మా ఊరి నుండి వాళ్ల ఊరికి 25కి.మీ దూరం! హైవేనుండి బస్‌లు వుంటాయి. మొదట నేను కుదరదని చెప్పాను. కానీ అమె కొంచెం రిక్వెస్ట్‌ చేసింది. నేను సరే అని లిఫ్ట్‌ ఇచ్చాను. అలా మా ఇద్దరికి పరిచయం అయింది.  తను నా నెంబర్ అడిగితే ఇచ్చాను. ఆ తరువాత మూడు రోజులకు నాకు తను కాల్‌ చేసింది. ఏదో అలా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత రెండు నెలల వరకు నో కాల్స్‌. నేను ఆమెని మరచిపోయాను. కానీ, 2 నెలల తరువాత ఓ రోజు సడెన్‌గా తను కాల్‌ చేసింది.  నేను చాలా సంతోషపడ్డాను. అలా రెండు వారాలు మాట్లాడుకున్నాం. ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం.

కొద్దిరోజుల తర్వాత ఇద్దరం కలుసుకున్నాం. ఆ రోజు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో తన కళ్లలో ఓ ఎమోషన్‌ని చూశాను. నాకు ఏదో తెలియని ఫీలింగ్‌ కలిగింది. ఆ రోజు నుంచి ఇంకొంచెం దగ్గర అయ్యాం. అలా రెండు రోజులకు ఓ సారి కలిసే వాళ్లం. పార్కులకు, లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్లేవాళ్లం. లేట్‌నైట్‌ కాల్స్‌ అలా చాలా అనందంగా గడిచిపొతున్నాయి రోజులు. ఆ తర్వాత ఓ రోజు ఆమె పుట్టిన రోజు వచ్చింది! ఆ రోజు తన దగ్గరికి వెళ్లాను. ఇద్దరం బయటకు వెళ్లాం. అప్పుడే మెదటిసారి తనకు ‘మనం  పెళ్లి చేసుకుందామ ?’ అని అడిగాను. కానీ, ఆమె ‘కొంచెం సమయం కావాలి ఆలోచించడానికి’ అంది. నేను సరే అన్నాను. అలా మరో నెల గడిచింది. ఆ తర్వాత ఒక రోజు మళ్లీ ఆ విషయం గుర్తు చేశాను. అప్పుడే మొదటిసారి నాకు ఓ విషయం చెప్పింది. తను వేరే అతన్ని ప్రేమిస్తున్నానని, ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నామని చెప్పింది. నేను కొంచెం షాక్ అయ్యాను! కానీ, సరే అన్నాను.

అప్పటినుంచి ఆమెకు కొంచెం దూరంగా ఉండడం మొదలుపెట్టా. కానీ, తను నాకు ఫోన్‌ చేస్తూనే వుంది. నేను ఆమెతో గొడవ పడేవాన్ని. తను ఏడుస్తూనే నాతో మాట్లాడేది. ‘నువ్వంటే ఇష్టమే కానీ పెళ్లి చేసుకోలేను’ అనేది. ఆ సమయంలో నేను చాలా మానసిక సంఘర్షణకు లోనయ్యాను. ఓ రోజు తను ప్రేమిస్తున్న అతని ఫోన్‌ నెంబర్‌ నాకు దొరికింది. కాల్‌ చేశాను! అప్పుడే వాడి గురించి తెలుసుకున్నా. వాడికి చెడ్డ అలవాట్లు వున్నాయి. గంజాయి, డ్రగ్స్‌లాంటివి కూడా అలవాటు వున్నాయి. నాకా విషయం తెలిసి షాక్ అయ్యాను. వాడిని ఎలా ప్రేమించింది అని అనుకున్నాను. అలా వాడిని ఓసారి  కలిశాను. తన గురించి అడిగాను కానీ, వాడు ఆమెని వాడుకుని వదిలేసే ఆలోచనలతో వున్నాడు. అంతే కాదు వాడి దగ్గర ఆ అమ్మాయి పర్సనల్‌ ఫొటోలు, వీడియోలు వున్నాయి.

చాలా బాధ కలిగింది. ఇక ఇదంతా వదిలేద్దాం అని నిర్ణయించుకున్నాను. కానీ వాడు వదలలేదు! కారణం వాడికి అనుమానం. రోజూ కాల్‌ చేసి ‘‘తనని కలిశావా? ఫోన్‌ మాట్లాడుతోందా?’’ అని అడిగేవాడు. ఇక నా వల్ల కాలేదు. ఇద్దరినీ పిలిచి మాట్లాడాను. ‘ఇక మీతో నాకు  ఏ సంబంధం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకండి’ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తరువాత 2 గంటలకు తను నాకు కాల్‌ చేసింది. ఇక ఎప్పటికీ మనం కలుసుకోలేము అని చెప్పింది. వాడు తనని కొట్టాడని, రోడ్డు మీద వదిలేశాడని.. నేను కూడా ఆమెను వాడితో అక్కడే వదిలేసి వెళ్లానని చెప్పి కాల్‌ కట్‌ చేసింది. అంతే అప్పటినుంచి ఇద్దరం కలుసుకోలేదు.
- రమేష్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement