సౌందర్యలా చేశావని అంటున్నారు | ‘Seetha Ramuni Kosam’ gets a UA from Censor Board | Sakshi
Sakshi News home page

సౌందర్యలా చేశావని అంటున్నారు

Published Thu, Dec 7 2017 12:56 AM | Last Updated on Thu, Dec 7 2017 12:56 AM

‘Seetha Ramuni Kosam’ gets a UA from Censor Board - Sakshi

శ్రీరత్‌ శ్రీరంగం, కారుణ్య జంటగా అనిల్‌ గోపిరెడ్డి దర్శకత్వంలో   శిల్పా శ్రీరంగం, సరిత గోపీరెడ్డి నిర్మించిన చిత్రం ‘సీత రాముని కోసం’. ఈ నెల 15న సినిమా రిలీజవుతోంది. ఈ సందర్భంగా కారుణ్య మాట్లాడుతూ – ‘‘సీత రాముని కోసం’ సినిమా కంటే ముందు నేను కొన్ని సినిమాలు చేశా. అయితే, ప్రేక్షకులకి పెద్దగా రీచ్‌ కాలేదు. ఈ సినిమాతో కచ్చితంగా ప్రేక్షకులకి దగ్గరవుతాననే నమ్మకం ఉంది. అందుకే ‘సీత రాముని కోసం’ నా తొలి సినిమాలా భావిస్తా. ఇదొక ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రంలో నా పాత్ర పేరు సీత.

అనిల్‌గారు ఎంతో ఇష్టపడి రాసుకున్న కథ. బాపుగారి సినిమాల్లో హీరోయిన్స్‌ ఎలా ఉంటారో ఇందులో నేనలా కనిపిస్తా. సెట్స్‌లో అందరూ సీత అనే పిలిచేవారు. నా నటన చూసి సౌందర్యలా చేశావని యూనిట్‌ సభ్యులు అన్నారు. ఆమె గొప్ప నటి. సౌందర్యగారిలో నేను ఒక శాతం నటించినా గొప్పగానే భావిస్తా. ఆమెలా ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ రోల్స్‌ చేయాలనుంది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement